పెళ్లైన మగాడితో ప్రేమలో పడ్డారంటే.. నీనా గుప్తా ఆసక్తికర వీడియో

3 Nov, 2021 21:37 IST|Sakshi

బాలీవుడ్‌ నటి నీనా గుప్తా ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌లో ఆసక్తికర వీడియోను పోస్ట్‌ చేసింది. ఒక పుస్తకంలో చదివిన వాక్యాన్ని మీతో పంచుకుంటున్నాను. పెళ్లైన మగాడితో ప్రేమలో పడితే కళ్లకు మస్కారా పెట్టుకోవద్దు.. ఈ లైన్‌ చాలా బాగుంది కదూ.. నేనేం చెప్తున్నానో మీకీపాటికే అర్థం అయి ఉంటుంది అని చెప్పుకొచ్చింది. అవును, పెళ్లైన మగాళ్లను ప్రేమిస్తే మిగిలేవి కన్నీళ్లేనంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరి పెళ్లైన మహిళలను ప్రేమిస్తే? పరిస్థితి ఏంటి? అని మరికొందరు అనుమానాలు లేవనెత్తుతున్నారు. నీనా ఇచ్చిన సలహా బాగుందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

కాగా నీనా గతంలో ఇదివరకే పెళ్లైన వెస్టిండీస్‌ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్‌ను ప్రేమించింది. వీరి ప్రేమకు గుర్తుగా మసాబా గుప్తా జన్మించింది. కానీ రిచర్డ్‌ నీనాను పెళ్లి చేసుకోలేను అని చెప్పాడు. సింగిల్‌ పేరెంట్‌గానే మసాబాను పెంచి పెద్ది చేసింది నీనా.

A post shared by Neena Gupta (@neena_gupta)

మరిన్ని వార్తలు