పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌

3 Jun, 2021 11:36 IST|Sakshi

సింగర్‌ నీతి మోహన్‌ బుధవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఆనందకరమైన విషయాన్ని ఆవిడే స్వయంగా సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 'మా కుటుంబంలోకి ఓ బుడ్డోడు అడుగు పెట్టినందుకు నిహార్‌ పాండ్యా, నేను సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాం. ఆ పసివాడిని నా చేతుల్లోకి తీసుకోవడం అనేది మర్చిపోలేని అనుభూతి. ఇప్పటికీ అదే ఆనందంతో పులకరించిపోతున్నాను' అని రాసుకొచ్చింది.

అటు నిహార్‌ కూడా తొలిసారి తండ్రైనందుకు ఆనందం వ్యక్తం చేశాడు. 'నాకు మా నాన్న నేర్పించినవన్నీ ఈ చిన్నోడికి నేర్పించే అవకాశాన్ని నా అర్ధాంగి కల్పించింది. ఆమె అనునిత్యం నాకు ప్రేమను పంచుతూనే ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు' అని పేర్కొన్నాడు.

కాగా ఒక ఫ్రెండ్‌ పెళ్లిలో నిహార్‌ పాండ్యా, నీతి మోహన్‌ కలుసుకున్నారు. అక్కడి నుంచి మొదలైన వీరి ప్రేమ ప్రయాణం పెళ్లి వరకూ వెళ్లింది. 2019 ఫిబ్రవరి 15న జరిగిన వివాహ వేడుకకు హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌ వేదికగా నిలిచింది. ఇదిలా వుంటే నీతి.. జియా రే, ఇష్క్‌ వాలా లవ్‌. సాదీ గల్లీ ఆజా వంటి పలు పాటలు ఆలపించింది. ఇక గతంలో మోడల్‌గా మెరిసిన నిహార్‌ నటుడిగానూ సత్తా చాటాడు. 'మణికర్ణిక: ద క్వీన్‌ ఆఫ్‌ జాన్సీ' చిత్రంలోని ఓ పాత్రలో తళుక్కుమని మెరిసాడు.

A post shared by NEETI MOHAN (@neetimohan18)

చదవండి: హృతిక్‌ రోషన్‌ మాజీ భార్య పోస్టుపై బాయ్‌ఫ్రెండ్‌ కామెంట్స్‌ వైరల్‌!

యాంకర్‌ రవిపై ఫన్‌ బకెట్‌ జస్విక ఆసక్తికర వ్యాఖ్యలు

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు