Neetu Chandra: నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు

14 Jul, 2022 15:51 IST|Sakshi

ఓ బడా వ్యాపారవేత్త తనని వేతనం తీసుకునే భార్యగా ఉండమని ఆఫర్‌ చేశాడంటూ నటి నీతూ చంద్ర తన ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అంతేకాదు శాలరీడ్‌ వైఫ్‌(వేతనం తీసుకునే భార్య) ఉంటే తనకు రూ. 25 లక్షలు ఇస్తానని సదరు వ్యాపారవేత్త ఆఫర్‌ చేశాడని కూడా ఆమె వెల్లడించింది. ఇటీవల ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నీతూ పలు సంచలన విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భందగా ఆమె మాట్లాడుతూ.. ‘నాది సక్సెస్ ఫుల్ యాక్టర్ ఫెయిల్యూర్ స్టోరీ. 13 మంది జాతీయ అవార్డు గ్రహీతలైన నటుల సరసన హీరోయిన్‌గా చేశాను. పులు పెద్ద సినిమాల్లో నటిని. అలాంటి నాకు ఈ రోజు పని లేదు. ఒక పెద్ద వ్యాపారవేత్త నాకు నెలకు  రూ. 25 లక్షలు ఇస్తానని, జీతం తీసుకుని భార్యగా ఉండాలని కోరాడు. అప్పుడు నా దగ్గర డబ్బు లేదు, పనీ లేదు. ఇన్ని మంచి సినిమాల్లో నటించాక కూడా నేను ఇక్కడ అనవసరంగా ఉన్నానేమో అని అనిపిస్తుంది’ అని నీతూ వాపోయింది.

కాగా 2005లో ‘గరం మసాలా’ మూవీతో నీతూ హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత  ట్రాఫిక్ సిగ్నల్, వన్ టూ త్రీ, ఓయ్ లక్కీ లక్కీ ఓయ్, అపార్ట్‌మెంట్ 13బి వంటి చిత్రాలలో నటించింది.  అంతేకాదు ఆమె పలు అల్బమ్‌ సాంగ్స్‌లో కూడా నటించింది. ఇక చివరిగా షెఫాలీ షా, రాహుల్ బోస్, సుమీత్ రాఘవన్‌లు ప్రధాన పాత్రలు పోషించిన ‘కుచ్ లవ్ జైసా’ సినిమాలో కనిపించింది. ఆమె నటించిన ఓయ్ లక్కీ లక్కీ ఓయ్ సినిమా ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నేషనల్‌ అవార్డును గెలుచుకుంది. ఆమె మరో చిత్రం ‘మిథిలా మఖాన్’ కూడా జాతీయ అవార్డును అందుకుంది. 

మరిన్ని వార్తలు