వైభవంగా ప్రముఖ గాయని వివాహం

24 Oct, 2020 19:31 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ గాయని నేహా కక్కర్‌-రోహాన్‌ ప్రీత్‌ సింగ్‌ల అభిమానులకు శుభవార్త. వీరి వివాహం కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య అంగరంగ వైభవంగా శనివారం గురుద్వారాలో జరిగింది. ప్రస్తుతం నేహుల వివాహ మహోత్సవ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నేహా కక్కర్‌ అభిమానుల ఇన్‌స్టా పేజీలో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్‌లోని పలువురు గాయనిగాయకులు, సినీ సెలబ్రెటీలు, అభిమానుల నుంచి నూతన జంటకు సోషల్‌ మీడియాలో వివాహ శుభాకాంక్షలు వె‍ల్లువెత్తున్నాయి. (చదవండి: హల్దీ వేడుక.. ఫొటోలు షేర్‌ చేసిన సింగర్‌)

Finally #NehuPreet is Getting Marriad Today ❤️😍 . . . . #FeelItReelIt #FeelKaroReelKaro . . . . #Postivity #KeepSmiling #SpreadLove #Gratitude #NehaKakkar #NehaKakkarLive #NeHearts #Neheart #NehuDaVyah #NehuPreet #Sushantsinghrajput #RohanpreetSingh #nehakakkarlive #biggboss #biggboss13 #salmankhan #tonykakkar #sonukakkar #bb13 #StayHome #StaySafe #StayPositive #SpreadLove #GharBaithoIndia #its_nehakakkar

A post shared by Neha Kakkar (@its_nehakakkar) on

అంతేగాక పెళ్లి రిసెప్షన్‌ వేడుకకు సంబంధించిన పలు వీడియోలు, ఫొటోలను నేహా సోదరుడు, గాయకుడు టోనీ కక్కర్‌ షేర్‌ చేశాడు. పంజాబీ సంప్రదాయంలో జరిగిన ఈ వివాహ వేడుకలో నూతన వధూవరులు ఇద్దరూ లేత గులాబీ రంగు దుస్తులను ధరించి చూడముచ్చటైన జంటగా అందరి మన్ననలను అందుకుంటున్నారు. ఇటీవల రోకా కార్యక్రమం వీడియోను నేహా షేర్‌ చేసి అభిమానులను సర్‌ప్రైజ్‌ చేసిన సంగతి తెలిసిందే. అంతేగాక నిన్న(శుక్రవారం) జరిగిన హల్ది కార్యక్రమం ఫొటోలు, వీడియోలు కూడా విపరీతంగా వైరల్‌ అయ్యాయి. (చదవండి: రోకా వేడుక వీడియో షేర్‌ చేసిన సింగర్‌)

Never Forget Forever #NehuDaVyah 😍❤️ . . . . #FeelItReelIt #FeelKaroReelKaro . . . . . . #Postivity #KeepSmiling #SpreadLove #Gratitude #NehaKakkar #NehaKakkarLive #NeHearts #Neheart #NehuDaVyah #NehuPreet #Sushantsinghrajput #RohanpreetSingh #nehakakkarlive #biggboss #biggboss13 #salmankhan #tonykakkar #sonukakkar #bb13 #StayHome #StaySafe #StayPositive #SpreadLove #GharBaithoIndia #its_nehakakkar

A post shared by Neha Kakkar (@its_nehakakkar) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు