ఈ నెల‌లోనే ప్ర‌ముఖ‌ సింగ‌ర్ పెళ్లి!

18 Oct, 2020 16:37 IST|Sakshi

త‌న గాత్రంతో సంగీత ప్రియుల‌ను ఉర్రూతలూగిస్తున్న ప్ర‌ముఖ గాయ‌ని నేహా క‌క్క‌ర్ త్వ‌రలోనే పెళ్లి కూతురిగా ముస్తాబ‌వ‌నున్న‌ట్లు వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్న విష‌యం తెలిసిందే. అది నిజ‌మేన‌ని ధ్రువీక‌రిస్తూ నేహా.. గ‌త నెల‌లో పంజాబీ గాయ‌కుడు, న‌టుడు రోహ‌న్‌ప్రీత్‌తో క‌లిసి దిగి ఉన్న ఫొటోను పంచుకున్నారు. 'నువ్వు నా వాడివి' అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించారు. రోహ‌న్‌ కూడా వాళ్లిద్ద‌రూ క‌లిసి ఉన్న ఫొటోను నెట్టింట షేర్ చేస్తూ 'నేను నీ వాడినే నేహా' అని క్యాప్ష‌న్ జ‌త చేశారు. దీంతో ఈ ఇద్ద‌రి మ‌న‌సులు ఒక్క‌ట‌య్యాయ‌ని, పెళ్లి ఖాయ‌మేన‌ని సోష‌ల్ మీడియా కోడై కూసింది. ఈ వార్త‌లకు మ‌రింత ఊత‌మిస్తూ తాజాగా సోష‌ల్ మీడియాలో పెళ్లి ప‌త్రిక‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. అందులో అక్టోబ‌ర్ 26న ఢిల్లీలో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుండ‌గా, పంజాబ్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. (చ‌ద‌వండి: ఈ ఏడాది చివర్లో శ్వేతతో నా పెళ్లి: నటుడు)

మ‌రి ఇది నిజ‌మా? కాదా? అనే విష‌యంపై సింగ‌ర్ స్పందించాల్సి ఉంది. కాగా కాలా చ‌ష్మా, దిల్‌బ‌ర్ రీమిక్స్ వంటి హిట్ పాటల‌తో నేహా క‌క్క‌ర్ బాలీవుడ్‌లో టాప్ సింగ‌ర్‌గా గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త మ్యూజిక్ ఆల్బమ్స్‌తో అభిమానుల‌ను అల‌రించే ఆమె గ‌తంలో న‌టుడు హిమ‌న్షు కోహ్లితో ప్రేమాయ‌ణం జ‌రిపారు. కానీ ఇద్ద‌రి మ‌ధ్య బేధాభిప్రాయాలు త‌లెత్త‌డంతో బ్రేక‌ప్ చెప్పుకున్నారు. తాజాగా రోష‌న్‌తో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నారు. (చ‌ద‌వండి: నువ్వు నా వాడివి.. నా జీవితం నువ్వే నేహా!)

Repost by @gosipgiriblog @nehakakkar @rohanpreetsingh #NehaKakkar #RohanPreetSingh #NehuDaVyah #NehuPreet

A post shared by Preeti sahu (@neheartpreeti) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా