‘నేను c/o నువ్వు’లాంటి చిత్రాలు ఇంకా రావాలి

29 Sep, 2022 18:22 IST|Sakshi

రత్న కిషోర్, సన్య సిన్హా, సాగారెడ్డి, సత్య, ధన, గౌతమ్ రాజ్ నటీనటులుగా సాగారెడ్డి తుమ్మ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘నేను c/o నువ్వు'. ఆగాపే అకాడమీ పతాకంపై అతవుల, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్‌లు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రం నుండి విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 30 న  గ్రాండ్ గా విడుదల అవుతుంది.

ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సినీ, రాజకీయ  ప్రముఖులకు, పాత్రికేయులకుప్రీమియర్ షోను ప్రదర్శించడం జరిగింది. షో అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్మాతలు , రాజకీయ నాయకులు  మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగుంది. మనం ఈ మధ్య కులం పేరుతో ఇంకా పరువు హత్యలు జరుగుతుండడం  మనం చూస్తునే ఉన్నాం. కాబట్టి ఇలాంటి సందేశాత్మక చిత్రాలు థియేటర్స్ కు కచ్చితంగా రావాలి.ఈ సినిమాల వలన  ప్రేక్షకులలో ఇంకా అవగాహన  పెరుగుతుంది’ అన్నారు.

మరిన్ని వార్తలు