నెట్‌ఫ్లిక్స్‌లో విజయ్‌ 'మాస్టర్'‌,100కోట్లకు డీల్‌!

28 Nov, 2020 12:21 IST|Sakshi

100 కోట్లకు పైగానే డీల్‌ ! 

చెన్నై : తమిళ స్టార్‌ దళపతి విజయ్ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విజయ్‌ సినిమా అంటే బాక్సాఫీస్‌ బద్దలవ్వాల్సిందే. తాజాగా విజయ్‌ నటించిన 'మాస్టర్'‌ సినిమాపై కూడా అంచనాలు అదే రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సినిమా టీజర్ యూట్యూబ్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. విడుదలైన రెండు వారాలలోపే 40 మిలియన్ల వ్యూస్ సాధించింది విజయ్‌ స్టామినాను మరోసారి చూపించింది. అన్ని వర్గాల ప్రేక్షకులు, విమర్శకుల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తోంది. టీజర్‌  విడుదలైన 16 గంటల్లోనే 1.6 మిలియన్లకు పైగా లైక్‌లతో యూట్యూబ్‌లో ఎక్కువ లైక్స్‌ను సొంతం చేసుకున్న టీజర్‌లలో ఒకటిగా అరుదైన రికార్డును సాధించింది.  లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా,కరోనా కారణంగా బ్రేక్‌ పడింది. తాజాగా 'మాస్టర్'‌ డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇందుకు గాను భారీ మొత్తంలోనే నిర్మాతలకు అప్పజెప్పినట్లు తెలుస్తోంది. (‘మాస్టర్‌’ టీజర్‌.. స్టైలిష్‌ లుక్‌లో విజయ్)‌

అయితే  'మాస్టర్' లాంటి భారీ బడ్జెట్‌ సినిమా థియేటర్‌లోనే విడుదల అవుతుందని, ఓటీటీల వైపు వెళ్లే ఆలోచనే లేదని నిర్మాతలు ఇదివరకు ప్రకటించారు. దర్శకుడు లోకేష్‌ కనగరాజ్ సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. మరోవైపు తమిళ థియేటర్స్‌ సంఘం సైతం విజయ్‌ సినిమా ఓటీటీలో రిలీజ్‌ చేస్తే ఒప్పుకనేది లేదని హెచ్చరించాయి. అయితే థియేటర్లు తెరిచినా ఇప్పుడప్పుడే జనాలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేస్తు‍న్నట్లు టాక్‌. ఇందుకుగానూ  నెట్‌ఫ్లిక్స్ 100కోట్లకు పైగానే డీల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే మాస్టర్‌ చిత్రం 2021 జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా ఈ వార్తలపై చిత్ర యూనిట్‌ ఇంకా స్పందించలేదు. జేవియర్ బ్రిట్టో తన సొంత బ్యానర్ ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్‌ గా నటించారు. మాలవికా మోహనన్, ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ వంటి భారీ తారగణంతో చిత్రం పై  అంచానలను పెంచాయి. .ఇదిలావుండగా, విజయ్ తన 65 వ చిత్రం ప్రి ప్రొడక్షన్ పనులను ప్రారంభించాడు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్నఈ చిత్రం ఫిబ్రవరి 2021 లో మాస్టర్ విడుదల అనంతరం సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉంది. (ట్రెండింగ్‌లో మాస్టర్‌ టీజర్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు