Kaala Paani: అండమాన్ దీవుల నేపథ్యంలో వస్తోన్న 'కాలాపాని'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

22 Sep, 2023 09:30 IST|Sakshi

ప్రస్తుత సినీ ప్రపంచంలో ఓటీటీలదే కీలకపాత్ర. ఎప్పటికప్పుడు కొత్త కొత్త  ఓటీటీ ప్రియులను అలరిస్తున్నాయి. ఇక ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ కంటెంట్ విషయంలో కాస్తా ముందే ఉంటుంది. డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో సినీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. తాజాగా మరో కొత్త ఇండియన్‌ సిరీస్‌లో మిమ్మల్ని అలరించేందుకు వచ్చేస్తోంది.

ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతోన్న గన్స్ అండ్ గులాబ్స్, ఢిల్లీ క్రైమ్, సేక్రెడ్ గేమ్స్, లిటిల్ థింగ్స్ సిరీస్‌లు బాగా పాపులర్ అయ్యాయి. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా మరో కొత్త సిరీస్‌ను ప్రకటించింది. కాలా పాని పేరుతో మరోసారి మిమ్మల్ని ఆకట్టుకునేందుకు వస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌పై క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చారు. 

ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో అక్టోబ‌ర్ 18 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు మేక‌ర్స్ వెల్లడించారు. దీంతో పాటు ఓ వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో చూస్తే అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలు చుట్టే కథ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో బాలీవుడ్ న‌టి మోనా సింగ్ , అశుతోష్ గోవారికర్, అమీ వాఘ్, సుకాంత్ గోయెల్, వికాస్ కుమార్, అరుషి శర్మ, రాధిక మెహ్రోత్రా, చిన్మయ్ మాండ్లేకర్, పూర్ణిమ ఇంద్రజిత్  ఈ సిరీస్‌లో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. పోషమ్ పా పిక్చర్స్ బ్యాన‌ర్‌పై ఈ సిరీస్‌ను బిశ్వపతి సర్కార్, అమిత్ గోలాని, సందీప్ సాకేత్, నిమిషా మిశ్రా సంయుక్తంగా నిర్మించారు. ఈ సిరీస్‌కు సమీర్ సక్సేనా, అమిత్ గోలాని క‌లిసి దర్శకత్వం వహించారు.

మరిన్ని వార్తలు