సమంతకు నెట్‌ఫ్లిక్స్‌ భారీ ఆఫర్‌.. వైరల్‌ అవుతోన్న రెమ్యునరేషన్‌!

14 Jun, 2021 14:30 IST|Sakshi

పరిశ్రమలో అక్కినేని కోడలు సమంత క్రేజ్‌ గురించి పత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోతూ తన నటనతో కట్టిపడేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్‌ హీరోయిన్స్‌ కంటే అత్యధిక రెమ్యూనరేషన్‌ తీసుకుంటూ వరుసగా ఆఫర్లు అందిపుచ్చుకుంటోంది. పెళ్లి తర్వాత కూడా తన క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. మునుపటి కంటే ఇప్పుడే మరిన్ని ఆఫర్స్‌ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటూ వెండితెరపై ఇటూ బుల్లితెరపై తన సత్తా చాటుతోంది ఆమె. పాత్రకు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ అగ్రనటిగా దూసుకుపోతోంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా సరైన సమయంలో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టిన సామ్‌ ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఇటీవల ఆమెజాన్‌ ప్రైం విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌తో మంచి విజయం సాధించింది. ఇక్కడ తొలి సిరీస్‌తోనే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇదిలా ఉండగా తాజాగా మరో దిగ్గజ ఓటీటీ సంస్థ సమంతకు భారీ ఆఫర్‌ను ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సమంత సినిమాలు బాగా మార్కెట్‌ చేస్తున్నాయి. దీని దృష్ట్యా నెట్‌ఫ్లిక్స్‌ ఆమెతో ఓ వెబ్‌ సిరీస్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తోందట. ఇందుకు గాను సమంతకు ఏకంగా 8 కోట్ల రెమ్యూనరేషన్‌ ఇవ్వడానికి సిద్దమైనట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలో ఎంతవరకు నిజముందన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

మరిన్ని వార్తలు