Bahubali 3: బాహుబలి 3 ఇక లేనట్టేనా..? రూ. 150 కోట్లు ఖర్చు చేశాక కూడా

24 Jan, 2022 21:41 IST|Sakshi

Netflix Is Put Aside Bahubali Before The Beginning Web Series: దర్శక ధీరుడు తెరకెక్కించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిత్రం 'బాహుబలి'. డార్లింగ్​ ప్రభాస్​ను  పాన్​ ఇండియా స్టార్​గా మార్చేసింది ఈ సినిమా. ప్రభాస్​తోపాటు రానా, అనుష్క, రమ్యకృష్ణ కీలకపాత్రల్లో రూపొందిన ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమాతో నటీనటుల నుంచి సాంకేతిక నిపుణుల వరకు ప్రతి ఒక్కరికీ పేరు వచ్చింది. అయితే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్​ఫ్లిక్స్​ 'బాహుబలి: బిఫోర్​ ది బిగినింగ్'​ పేరుతో ఓ సిరీస్​ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వివరాలను కూడా అధికారికంగా ప్రకటించారు. 

భారీ బడ్జెట్​తో ఈ సిరీస్​ను తెరకెక్కించాలని భావించిన నెట్​ఫ్లిక్స్​ ఈ ప్రాజెక్ట్​ను పూర్తిగా పక్కనపెట్టిట్లు సమాచారం. ఇప్పటివరకూ 6 నెలల పాటు షూటింగ్ చేశారు. ఈ చిత్రీకరణకు రూ. 150 కోట్లు ఖర్చయినట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్​ ఫైనల్ అవుట్​పుట్​పై నెట్​ఫ్లిక్స్​ సంతృప్తి చెందలేదని టాక్​. అందుకే ఈ సిరీస్​ మొత్తాన్ని పక్కన పెట్టేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్​ మీడియాలో తెగ వైరల్ కాగా, ఈ విషయంపై మేకర్స్​ అధికారికంగా స్పందించాల్సి ఉంది. 

అంతకుముందే మృణాల్ ఠాకూర్​ కీలక పాత్రలో కొంత భాగాన్ని షూట్​ చేసిన తర్వతా పలు కారణాలతో ఆమె ఈ సిరీస్​నుంచి తప్పుకుంది. తర్వాత వామికా గబ్బిని ఈ ప్రధాన పాత్రలో అనేక సన్నివేశాలను రీషూట్​ చేశారు. ఇప్పుడు ఇది కూడా పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్​ను పూర్తిగా పక్కన పెట్టారా ? తాత్కాలికంగానా ? అనేది తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు