రానా నాయుడు ట్రైలర్‌ రివ్యూ: తండ్రీ-కొడుకుల మధ్య జగడమే!

15 Feb, 2023 20:39 IST|Sakshi

దగ్గుబాటి వెంకటేశ్‌, రానా ప్రధాన పాత్రల్లో  నెట్‌ఫ్లిక్స్‌ నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘రానా నాయుడు’ (Rana Naidu) ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. స్కాండల్స్‌లో ఇరుకునే సెలబ్రిటీగా రానా, జైలు నుంచి రిలీజ్‌ అయిన వ్యక్తిగా వెంకీలు ఈ కథలో కనిపించనున్నారు.

కథలో ఈ ఇద్దరిదీ తండ్రీకొడుకుల క్యారెక్టర్‌లు. అయినా ఇద్దరికీ అస్సలు పడని క్యారెక్టర్లుగా చూపించారు. ఈ ఇద్దరి మధ్య జరిగే సంఘర్షణనే ప్రధాన కథాంశంగా మలిచినట్లు అర్థమవుతుంది. డైలాగులు కూడా కాస్త కటువుగా, నాటుగానే ఉండడం గమనార్హం.   హిందీ స్ట్రెయిట్‌, తెలుగు డబ్బింగ్‌ వెర్షన్‌లలో మార్చి 10వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఇది స్ట్రీమింగ్‌ కానుంది. 

మరిన్ని వార్తలు