Heeramandi: సంజయ్‌ లీలా భన్సాలి హీరామండి.. వేశ్యలే అక్కడ రాణులు

18 Feb, 2023 18:18 IST|Sakshi

బాలీవుడ్‌లో దిగ్గజ దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ఒకరు. వాస్త‌విక క‌థ‌ల‌ను, హిస్టారికల్‌ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్టా.  ‘హమ్ దిల్ దే చుకే సనమ్’, దేవదాస్, ‘బాజీరావ్ మస్తానీ’వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలను కళ్లకు కట్టినట్లుగా ప్రేక్షకులకు అందించారు. ఇక ఆయన ఓ వెబ్‌ సిరీస్‌తో డిజిటల్‌ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. పలువురు అగ్ర నటిమణులతో హీరామండి అనే వెబ్‌ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్‌ కోసం ఆయన రూపొందిస్తున్నారు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున​ ఈ సిరీస్‌ వేశ్యల కథ నేపథ్యంలో కొనసాగనున్నట్టు తెలుస్తోంది. శివరాత్రి సందర్భంగా ఈ సిరీస్‌ను నుంచి అప్‌డేట్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్‌. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ క్వీన్స్‌ గెటప్‌లలో రాయల్‌ లుక్‌లో కనిపించారు. అందమైన తారలంతా ఒకే ఫ్రేంలో రాయల్‌ లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్‌ అంత కనుల పండుగా చేసుకుంటున్నారు.

అయితే ఈ భారీ ప్రాజెక్ట్‌లో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్, అదితి రావ్ హైదరీ ప్రధాన పాత్రలో పోషిస్తున్నారు. కాగా స్వాతంత్య్రానికి ముందు ‘హీరమండి’ ప్రాంతంలోని వేశ్యల కథలను ఈ వెబ్‌సిరీస్‌ ద్వారా ప్రపంచానికి పరిచయం చేయనున్నారు. అలాగే, ఇక్కడి సాంస్కృతిక వాస్తవాలను కూడా తన సెట్‌ సిరీస్‌లో స్పృషించనున్నారు. ఈ సిరీస్‌లో ప్రేమ, ద్రోహం, వారసత్వం, రాజకీయాలను అంశాలుగా తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు