Netflix Releases in May 2022: నెట్‌ఫ్లిక్స్‌లో ఈ వారంలో విడుదలైన చిత్రాలు..

7 May, 2022 20:18 IST|Sakshi

ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ సరికొత్త కథాంశాలతో చిత్రాలను, వెబ్ సిరీస్‌లను అందిస్తోంది. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా ఎప్పుటూ సరికొత్త హంగులతో మూవీ లవర్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తోంది. అయితే తాజాగా డిఫరెంట్‌ కాన్సెప్ట్‌లతో ఈ మే నెలలోని మొదటి వారంలో పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఆ సినిమా విశేషాలేంటో ఓ లుక్కేద్దామా !

1. హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌: ఐస్‌ డ్రైవ్‌
జోహన్నా నోర్డ్‌బ్లాడ్‌ నటించిన డాక్యుమెంటరీ చిత్రం 'హోల్డ్‌ యువర్‌ బ్రీత్‌: ఐస్‌ డ్రైవ్‌'. మంచు కింద ఉన్న నీళ్లలో వరల్డ్‌ రికార్డ్ బద్దలు కొట్టడానికి ప్రయత్నించే ఓ డైవర్‌ కథగా ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఐయాన్ డెర్రీ దర్శకత్వం వహించిన ఈ డాక్యుమెంటరీ చిత్రం మే 3 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అవుతోంది. 

చదవండి: అత్యధిక వ్యూస్​ సాధించిన 'నెట్​ఫ్లిక్స్ సిత్రాలు' ఇవే

2. థార్‌
బాలీవుడ్‌ సీనియర్ హీరో అనిల్‌ కపూర్, బ్యూటీ ఫాతిమా సనా షేక్, హర్షవర్ధన్ కపూర్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'థార్'. సీక్రెట్స్ అండ్‌ ట్విస్ట్‌లతో ఈ థ్రిల్లర్‌ మూవీ ఉండనుంది. ఎడారిలో జరిగిన మర్డర్‌ మిస్టరీనీ చేధించే క్రమంలో ఒక పోలీసు అధికారికి ఎదురైన సవాళ్ల నేపథ్యంగా తెరకెక్కింది ఈ చిత్రం. రాజ్ సింగ్ చౌదరీ దర్శకత్వం వహించిన ఈ మూవీ మే 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 

3. ది టేక్‌డౌన్‌
ఒక హత్యను పరిశోధించేందుకు పదేళ్ల తర్వాత బృందంగా ఏర్పడిన ఇద్దరు పోలీసుల కథే 'ది టేక్‌డౌన్‌'. ఈ కామెడీ సిరీస్‌లో ఒమర్‌ సై, లారెంట్‌ లాఫిట్టే, ఇజా హిగెలిన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇది మే 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రదర్శింపబడుతోంది. 

మరిన్ని వార్తలు