Rana Naidu Web Series: రానా నాయుడు వెబ్‌ సిరీస్‌పై నెట్‌ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం!

30 Mar, 2023 09:03 IST|Sakshi

టాలీవుడ్‌ స్టార్స్‌ విక్టరి వెంకటేశ్‌, రానా దగ్గుబాటిలు నటించిన వెబ్‌ సిరీస్‌ రానా నాయుడు. ఇటీవల విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌ ఓటీటీలో సంచలనం సృష్టిస్తోంది. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ఈ సిరీస్‌కు అద్భుతమైన రెస్పాన్స్‌ను అందుకుంది. ఇక వ్యూవర్‌ షిప్‌లో రానా నాయుడు దూసుకుపోతుంది. ఓటీటీలో ఎంతో క్రేజ్‌ను సంపాదించుకున్న రానా నాయడుపై అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తున్నాయి. ఈ వెబ్‌ సిరీస్‌లో అశ్లీలత ఎక్కువగా ఉందంటూ పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

చదవండి: తండ్రి ఫొటో పట్టుకుని తారకరత్న కొడుకు అలా.. అలేఖ్య పోస్ట్‌ వైరల్‌

ఇందులో సెన్సార్‌కు మించి అసభ్య పదాలు, శృంగారపు సన్నివేశాలు అధికంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో రానా నాయుడు వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్‌పై నెట్‌ఫ్లిక్స్‌ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రానా నాయుడు సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీతో పాటు పలు భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సిరీస్‌లో అభ్యంతకర భాష ఎక్కువగా ఉండటంతో ఈ తెలుగు ఆడియోను తొలగించాలని నెట్‌ఫ్లిక్స్‌ షాకింగ్‌ నిర్ణయం తీసుకుందట. ఇదే విషయాన్ని నెట్‌ఫ్లిక్స్‌ త్వరలోనే అధికారికంగా కూడా ప్రకటించనుందట.  

తెలుగు ఆడియో తొలగించడానికి ప్రధాన కారణం అసభ్య పదాలు ఎక్కువగా ఉండటమే అని తెలుస్తోంది. ఇక మార్చి 10న స్ట్రీమింగ్ అయిన రానా నాయుడు వెబ్ సిరీస్ పది ఎపిసోడ్స్ ఉంది. ఎక్కువ మెుత్తంలో అడల్డ్ కంటెంట్ ఉండటంతో.. నెట్ ఫ్లిక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్లో నటించినందుకు గాను విక్టరీ వెంకటేష్ దాదాపుగా రూ.12 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం. రానా రూ. 8 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం.

చదవండి: వ్యాపారవేత్తతో కీర్తి సురేష్‌ పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆమె తల్లి మేనక

కాగా అమెరికన్ సిట్‌ కామ్ 'ది బిగ్ బ్యాంగ్ థియరీ' సిరీస్‌లో బాలీవుడ్‌ నటి మాధురి ధీక్షిత్‌ను అవమారిచే విధంగా వ్యాఖ్యలు ఉండటంతో రాజకీయ విశ్లేషకుడు మిథున్ విజయ్ కుమార్ మండపడిన సంగతి తెలిసిందే. ఆ ఎపిసోడ్‌ను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ ఆయన నెట్‌ఫ్లిక్స్‌కు లీగల్‌ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే రానా నాయుడు విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ జాగ్రత్త పడినట్లు కూడా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు