బాహుబలిని పక్కన పడేసిన నెట్‌ఫ్లిక్స్‌, మళ్లీ షూట్‌!

17 Mar, 2021 11:32 IST|Sakshi

భారత రికార్డులను తిరగరాసిన బాహుబలి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టిందీ అద్భుత చిత్రం. దీనికున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని అటు రాజమౌళి, ఇటు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ దీన్ని వెబ్‌సిరీస్‌గా తీసుకురావాలనుకున్నారు. దీంతో బాహుబలి మొదటి భాగానికి ముందు మాహిష్మతి రాజ్యం ఎలా ఉంది? శివగామి పాత్ర ప్రత్యేకతలు, ఇలా తదితర అంశాలను ఇందులో ప్రస్తావించారు. ఈ మేరకు కథ రెడీ చేయించడమే కాక 'బాహుబలి: బిఫోర్‌ ద బిగినింగ్‌' అనే టైటిల్‌ సైతం ఫిక్స్‌ చేసినట్లు సమాచారం. ఈ సిరీస్‌ను భారీ స్థాయిల్‌ షూట్‌ చేశారు కూడా! కానీ ఫైనల్‌ కట్‌ చూసేసరికి అంతా చెత్తచెత్తగా వచ్చిందట.

క్వాలిటీ విషయంలో అసలు కాంప్రమైజే కాని నెట్‌ఫ్లిక్స్‌ ఈ 9 ఎపిసోడ్లు చూసి గుడ్లు తేలిసినట్లు తెలుస్తోంది. ఓ రేంజ్‌లో తీద్దామనుకున్న సిరీస్‌ ఇంత డొల్లగా చెత్తగా తయారైందేంటని ఆశ్చర్యపోయిందట. దీంతో ఆ ఎపిసోడ్లన్నింటినీ క్యాన్సిల్‌ చేసినట్లు సమాచారం. అంటే అప్పటివరకు ఖర్చు చేసిన రూ.100 కోట్లు బూడిదలో పోసిన పన్నీరన్నమాటే. ఇక ఇది అట్టర్‌ ఫ్లాప్‌ కావడానికి కారణం ఓ రకంగా తక్కువ బడ్జెట్‌ కూడా కారణమేనని భావించిన నెట్‌ఫ్లిక్స్‌ తాజాగా రూ.200 కోట్లు కేటాయించి మరీ ఈ వెబ్‌సిరీస్‌ను సరికొత్తగా ప్లాన్‌ చేయమని నిర్మాతలను ఆదేశించిందట. దీంతో ఈ సిరీస్‌ బడ్జెట్‌ లెక్కలు మూడు వందల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నవారిలో రాజమౌళి కూడా ఒకరు.

చదవండి: ‘దృశ్యం 2’ సెట్స్‌లో జాయిన్ అయిన మీనా‌

వివాదాస్పద 'బాంబే బేగమ్స్‌' అసలు కథేంటి..?

మరిన్ని వార్తలు