Karan Johar: మీకు 'గే' అంటే ఇష్టమా?.. నెటిజన్‌కు కరణ్ జోహార్ కౌంటర్!

9 Jul, 2023 16:05 IST|Sakshi

బాలీవుడ్ చిత్రనిర్మాత కరణ్ జోహార్ దాదాపుగా అందరికీ సుపరిచితమే. గతేడాది బ్రహ్మస్త్ర సినిమాను నిర్మించారు. ఆలియా భట్, రణ్‌బీర్‌ కపూర్, నాగార్జున ఈ చిత్రంలో కీలకపాత్రల్లో కనిపించారు. ప్రస్తుతం 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రణ్‌వీర్‌ సింగ్, ఆలియా భట్ జంటగా కనిపించనున్నారు. అయితే కరణ్ జోహార్‌కు సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలోనూ అప్‌డేట్స్ ఇస్తుంటారు. 

(ఇది చదవండి: 25 ఏళ్ల నుంచి అవకాశాలే రాలే, అందుకే ఇలా తయారైంది: ఉర్ఫీ)

అయితే తాజాగా ట్విటర్‌కు పోటీగా థ్రెడ్స్ యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. కరణ్ జోహార్ అందులోకి ఎంట్రీ ఇచ్చారు. థ్రెడ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన కరణ్.. ‍అభిమానులు తనను ఏదైనా అడగాలంటూ ఛాన్స్ ఇచ్చారు. పది నిమిషాల పాటు మీ అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపాడు. అయితే ఓ నెటిజన్ మాత్రం చాలా ఆశ్చర్యకర ప్రశ్నవేశాడు. మీరు గే కదా? అని మెసేజ్ చేశాడు.

అతనికి కూడా అదేరీతిలో దిమ్మదిరిగేలా కౌంటరిచ్చాడు కరణ్. నీకు ఆసక్తిగా ఉందా? అంటూ రిప్లై ఇచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కొత్త యాప్‌లో ఎంట్రీ ఇవ్వగానే కరణ్‌కు ఇలాంటి షాకిచ్చాడేంట్రా నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. కాగా.. కరణ్ జోహార్ నిర్మిస్తున్న రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ జూలై 28న థియేటర్లలో సందడి చేయనుంది. 

(ఇది చదవండి: నా చీర పిన్ తీసేయమని డైరెక్టర్ అడిగారు: సీనియర్ హీరోయిన్)

మరిన్ని వార్తలు