Kiran Abbavaram: 'ఎంత మాట అన్నావ్ తమ్ముడు'.. కిరణ్ అబ్బవరం షాక్

8 Feb, 2023 18:19 IST|Sakshi

'ఎస్ఆర్‌ కల్యాణ మండపం' సినిమాతో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్‌ అబ్బవరం. ఆ తర్వాత సమ్మతమే చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తాజాగా తన అభిమానులతో ఆస్క్ కిరణ్ అబ్బవరం నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు హీరో సమాధానమిచ్చారు. 
 

అయితే ఓ నెటిజన్ అడిగిన ప్రశ్న నెట్టింట తెగ వైరలవుతోంది. ఆ నెటిజన్ ప్రశ్నకు హీరో ఆశ్చర్యానికి గురయ్యారు. 'అన్న నీ పెళ్లి ఎప్పుడు? మేసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకపోతే ఎప్పటికీ సింగల్‌గానే మిగిలిపోతావ్' అంటూ ప్రశ్నించాడు. దీనికి హీరో స్పందిస్తూ.. 'ఎంత మాట అనేశావ్ తమ్ముడు' అంటూ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఆ  తర్వాత నెటిజన్ల్ అడిగిన పలు ప్రశ్నలకు కిరణ్ సమాధామిచ్చారు. 

మరిన్ని వార్తలు