వివాదంలో మెగా కోడలు ఉపాసన.. ఆ పోస్ట్‌పై నెటిజన్స్‌ ఫైర్‌

27 Jan, 2022 11:18 IST|Sakshi

మెగా కోడలు, మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రామ్‌ చరణ్‌ భార్యగా, అపొలో అధినేత మనవరాలిగా కాకుండ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. ఫిట్‌ నెస్‌, ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను అభిమానులతో షేర్‌ చేసుకుంటారు. ఇలా సోషల్‌ మీడియాను మంచి విషయాల కోసం వాడే ఉపాసన.. తాజాగా నెటిజన్ల ఆగ్రహానికి గురైయ్యారు. దానికి కారణం ఆమె షేర్‌ చేసిన ఒక ఫోటోనే.

రిపబ్లిక్‌ డే సందర్భంగా జనవరి 26న దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఓ గుడి గోపురం ఫోటోని షేర్‌ చేసింది ఉపాసన. అందులో దేవుళ్ల ఫోటోలకు బదులు.. కొంతమంది ప్రజలు ఉన్నారు. ఆ ఫోటోలో తనతో పాటు రామ్‌ చరణ్‌ కూడా ఉన్నారని, ఎక‍్కడో కనిపెట్టండి అంటూ  ఉపాసన ఫాలోవర్స్‌ని కోరారు. దీనిపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు.  ఈ పోస్టర్‌ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని,  ఇలాంటి పోస్టులు పెట్టి మీపై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ నెటిజన్స్‌ కామెంట్‌ చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు