మిలింద్‌ సోమన్‌ అరెస్ట్‌, వారు శాంతించారు!

7 Nov, 2020 14:35 IST|Sakshi

పనాజీ: మోడల్‌, యాక్టర్‌ మిలింద్‌ సోమన్‌ మీద అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారు అనే ఆరోపణలతో గోవా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. బుధవారం నాడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తన ఫిట్‌నెస్‌ను ప్రపంచానికి చూపించడం కోసం  బీచ్‌లో బట్టులు లేకుండా ఉన్న ఫోటోలను సోషల్‌ మీడియా మిలింద్‌ షేర్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటోలో మిలింద్‌ ఫిట్‌నెస్‌ను చూసి నెటిజన్లందరూ వావ్‌ అంటూ ప్రశంసలు కురిపించారు. అయితే ఇలాంటి ఫోటోలను షేర్‌ చేస్తూ మిలింద్‌ అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారని గోవా సురక్షా మంచ్‌ ఆయన మీద ఫిర్యాదు చేసింది. దీంతో గోవా పోలీస్‌ స్టేషన్‌లో ఆయన మీద సెక్షన్‌ 294( పబ్లిక్‌ ప్లేస్‌లో అశ్లీలంగా ప్రవర్తించడం), ఐటీ యాక్ట్‌ 67 ​కింద ఆయన మీద కేసు నమోదయ్యింది.


 
ఇదిలా వుండగా మిలింగ్‌ తన న్యూడ్‌ ఫోటోలను షేర్‌ చేసినప్పుడు పూనమ్‌ పాండే గవర్నమెంట్‌ ఆస్తులలో ఆశ్లీలమైన ఫోటో షూట్‌లో పాల్గొందని  ఆమెపై కేసు నమోదయ్యింది. అనంతరం చాలా మంది ఆమె అభిమానులు పాండేకు ఒక న్యాయం, మిలింద్‌కు ఒక న్యాయమా? అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ఇప్పుడు మిలింద్‌ మీద కూడా కేసు నమోదు కావడంతో దీనికి సంబంధించి మీమ్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. మిలింద్‌ ఫోటో పెట్టి సమానమంటే సమానమే అని కొందరు మీమ్స్‌ క్రియేట్‌ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు పూనమ్‌కు మద్దతుగా నిలిచిన వారి మనసు ఇప్పుడు చల్లబడి ఉంటుందని ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

చదవండి: బర్త్‌డే స్పెషల్‌.. బీచ్‌లో బట్టలు లేకుండా.. 


 

మరిన్ని వార్తలు