బిగ్‌బాస్‌ దివిపై ట్రోల్స్‌.. పాప కాస్తా ఓవర్‌ చేస్తోందంటూ..

27 Apr, 2021 20:50 IST|Sakshi

నటి దివి బిగ్‌బాస్ తర్వాత ఒక్కసారిగా ఫేంను సంపాదించుకుంది. అంతకుముందు సినిమాల్లో నటించినప్పటికి ఈ భామ ఎవరికి అంతగా సుపరిచితురాలు కాదు. కానీ బిగ్‌బాస్‌ 4వ సీజన్‌లో హౌజ్‌ అడుగు పెట్టి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నది కొద్ది రోజులో అయినా అంత్యంత ప్రేక్షకదారణ పొందింది. తన అందం, అభినయం, ముక్కుసూటి తనంతో ఎంతోమందిని ఆకట్టుకుంది ఈ బ్యూటీ.

కాగా బిగ్‌బాస్‌ తర్వాత దివి సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. అంతేగాక ఫోటో షూట్‌లు చేస్తూ, పలు ప్రకటనలో నటిస్తూ ఫుల్‌ బిజీ అయిపోయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దివి బంజారాహిల్స్‌లోని ప్రోటిన్‌ మార్ట్‌ అనే బ్రాండ్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఈ బ్రాండ్‌ ప్రకటనలో నటించింది. ఈ యాడ్‌కు సంబంధించిన వీడియోను దివి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది.

ఇక అది చూసిన నెటిజన్లు.. ‘దివి పాప కాస్తా ఓవర్‌ చేస్తోంది’ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ యాడ్‌లో దివి తన వంట మనిషి చేసిన చేప కూర తింటూ ఆమెతో కాస్తా దురుసుగా ప్రవర్తిస్తుంది. దీంతో వంట మనిషి అవి ప్రోటిన్స్‌ నాన్‌ వెజ్‌ మార్ట్‌ నుంచి తీసుకొచ్చిన చేపలు పాపగారు అని చెప్పడంతో.. తనకు ప్రోటిన్స్‌ మీద నమ్మకం ఉందంటూ కాస్తా ప్రకటన ఇచ్చింది. కాగా ఇటీవల ఓ ఇంటరర్వ్యూలో దివి మాట్లాడుతూ..  అధికంగా ప్రోటీన్లను అందించే సీఫుడ్‌ అంటే తనకెంతో ఇష్టమని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ఆమె సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు నటించిన మహర్షితో పాటు పలు సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా నటించిన సంగతి తెలిసిందే. 

A post shared by Divi Vadthya (@actordivi)

చదవండి: 
సీ ఫుడ్‌.. మై డైట్ అంటున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దివి 

మరిన్ని వార్తలు