హీరోయిన్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

28 Aug, 2020 08:23 IST|Sakshi

పటౌడి యువరాణి సారా అలీఖాన్‌ నిత్యం ఏదో ఒక విషయంలో నెటిజన్ల ట్రోట్స్‌కు గురవుతున్నారు. ఇంతకముందు తను షేర్‌ చేసిన కొన్ని ఫోటోలు అసభ్యకరంగా ఉన్నాయంటూ అభిమానులు అసహనం వ్యక్తం చేయగా, మరోసారి ఆమెను ట్రోల్స్‌ చిక్కుల్లో పడేశాయి. ముస్లిం అయిన సారా కుటుంబం ప్రతి పండుగను జరుపుకుంటారు. అంతేగాక ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్‌ మీడియాలో షేర్‌చేస్తారు. ఈ క్రమంలో గురువారం గణేశ్‌ చతుర్థి సందర్భంగా వినాయకుడి వేడుకల వద్ద దిగిన ఫోటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీనికి ‘గణపతి బప్పా మోరియా’ అంటూ క్యాప్షన్‌ చేశారు. (‘ఛీ ఛీ.. సారా.. ఇదేం ఫొటో’: నెటిజన్ల ఫైర్‌!)

ప్రస్తుతం ఈ పోస్టు కారణంగా సారాపై టోల్రింగ్‌ జరుగుతోంది. హిందూ పండగను జరుపుకోవడంపై కొంతమంది మండిపడుతున్నారు. ‘సారా.. ముస్లింవా లేక హిందు’వా అంటూ విరుచుకుపడుతున్నారు. దీంతో ట్రోలింగ్‌ సారా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయారు. అయితే సారా అభిమానులు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. మతపరమైన విషయాలు వారి ఇష్టాలపై అధారపడి ఉంటాయని, సారా అన్ని పండగలకు విలువిచ్చి జరుపుకుంటారని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు. కాగా  కేదార్‌నాథ్‌ సినిమాతో తెరంగేట్రం చేసిన సారా సింబా, లవ్‌ ఆజ్‌కల్‌ సినిమాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె నటించిన కూలీ నెం.1 సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. (‘అప్పట్లో సుశాంత్‌, ఆమె ప్రేమలో ఉన్నారు’)

Ganpati Bappa Morya 🙏🏻💐💗💞

A post shared by Sara Ali Khan (@saraalikhan95) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు