‘ఈ నీతులు నీ కజిన్‌ రణ్‌బీర్‌కు చెప్పండి మేడం’

30 Apr, 2021 20:40 IST|Sakshi

ఇటీవల పలు బాలీవుడ్‌ జంటలు మాల్దీవుల్లో  షీకార్లు కొట్టి తిరిగి ముంబై వచ్చిన సంగతి తెలిసిందే. కరోనా కాలంలో కూడా భారత్‌ నుంచి ఎక్కువ మంది మాల్దీవులకు క్యూ కట్టడంతో అక్కడ ప్రభుత్వం ఇటీవల భారత పర్యాటకులపై నిషేధం విధించి లవ్‌బర్డ్స్‌కి షాక్‌ ఇచ్చింది. అయితే అంతకు ముందు పర్యాటనకు వెళ్లిన బాలీవుడ్‌ జంటలు అక్కడి ప్రకృతి అందాలు, బీచ్‌ తీరాల్లో, స్వీమ్మింగ్‌ ఫూల్‌లో ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను షేర్‌ చేసి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం దేశ ప్రజలు కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రతకు అల్లాడిపోతుంటే.. మీరు విహారయాత్రలకు వెళ్లడం ఎంటీ, మీకు బాధ్యత లేదా అంటూ వారిపై ఫైర్‌ అయ్యారు.

అలాగే నటుడు నవాజుద్దీన్‌ సిద్దీకి సైతం దేశం ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే.. పర్యాటనలకు వెళ్లడానికి కొంచమైన సిగ్గుండాలంటూ ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఈ  నేపథ్యంలో తాజాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌పై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ ఆమె తండ్రి రణ్‌ధీర్‌ కపూర్‌ కరీనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో కరోనా కాలంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరిస్తూ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ పోస్టు షేర్‌ చేసింది. ‘ప్రస్తుతం దేశంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయో ఇప్పటికి కొంద మంది అర్థం కావడం లేదు. ఈ విషయం నన్ను తీవ్రంగా బాదిస్తుంది.

ఒకసారి ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు మీ గడ్డం కిందకు మాస్క్‌ ధరించినప్పుడు లేదా రూల్స్‌ అతిక్రమించినప్పుడు ఒకసారి మన వైద్యులు, సిబ్బంది గురించి ఆలోచించండి. వాళ్లు మన కోసం శారీరకంగా, మానసికంగా శ్రమిస్తున్నారు. అందుకు ఇది చదువుతున్న ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించండి. ఇప్పుడు ప్రభుత్వాలకు మీ సహకారం చాలా అవసరం’ అంటూ సందేశం ఇచ్చింది. దీంతో నెటిజన్లు ‘ముందు ఈ నీతులు మీ వాళ్లకు చెప్పండి. వాళ్లే సిగ్గు లేకుండా దేశాలు తిరుగుతూ వేకెషన్లని ఎంజాయ్ చేస్తున్నారు’. అలాగే ‘మీ కజిన్ రణ్‌బీర్ కపూర్ కూడా వారం క్రితమే తన గర్ల్‌ఫ్రెండ్‌ అలియా భట్‌తో మాల్దీవులకు వెళ్లి వచ్చాడు. వాళ్లకు ఈ నీతులు వర్తించవా’. ‘ఇక మాల్దీవుల్లో షికార్లు చేస్తున్న మీ మిత్రులకు కూడా కాస్త అర్ధం అయ్యేలా చెప్పండి మేడం’ అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. 

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు