కాంబినేషన్‌ కుదిరిందా?

12 Aug, 2020 05:25 IST|Sakshi

అఖిల్‌ హీరోగా నటించనున్న ఐదో సినిమా దాదాపు ఖరారయింది. ప్రస్తుతం అతను నటిస్తోన్న ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రం షూటింగ్‌ చివరి దశలో ఉంది. పరిస్థితులు మామూలు స్థితికి రాగానే మొదట విడుదలయ్యే సినిమాల వరుసలో ఈ సినిమా కూడా ఉంటుంది. ఇక అఖిల్‌ నటించబోయే తర్వాతి సినిమాకి సురేందర్‌ రెడ్డి దర్శకుడని సమాచారం. ఇటీవల ఓ కథను నాగార్జునకు, అఖిల్‌కు సురేందర్‌ రెడ్డి వినిపించారట. కథ, అఖిల్‌ క్యారెక్టర్‌ బాగుండటంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని టాక్‌. రవితేజ హీరోగా తాను గతంలో తెరకెక్కించిన ‘కిక్‌’ సినిమా తరహాలో ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనర్‌గా సురేందర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట. అఖిల్‌ క్యారెక్టర్‌ చాలా జోష్‌గా ఉంటుందని తెలిసింది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు