ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమాలు ఇవే..

13 Sep, 2021 19:05 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత గతవారం గోపిచంద్‌ ‘సీటీమార్‌’ వంటి సినిమాలు థియేటర్‌లో విడుదలవగా, నాని ‘టక్‌ జగదీష్‌’ వంటి కొన్నిసినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. ఇలా  కొన్ని వెండితెరపై, మరికొన్ని బుల్లితెరపై సినీ ప్రేక్షకులను అలరించాయి. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ వారం విడుదలయ్యే మూవీస్‌ ఏంటో చూద్దాం!

థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు:

గల్లీలో రౌడీయిజం చేస్తానంటున్న సందీప్‌

జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో సందీప్‌కిషన్‌ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘గల్లీ రౌడీ’. ఫుల్‌టైమ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ రానున్న ఈ చిత్రంలో నేహాశెట్టి కథానాయిక. సెన్సార్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 17న థియేటర్‌ల్లో విడుదల కానుంది. ఇటీవల అగ్ర కథానాయకుడు చిరంజీవి ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.  రామ్‌ మిరియాల, సాయికార్తిక్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించాయి.

ట్యూషన్‌ చెప్పబోతున్న విజయ్‌ ఆంటోని

బిచ్చగాడు ‘ఫేం’ విజయ్‌ ఆంటోని తాజాగా నటించిన చిత్రం ‘విజయ రాఘవన్‌’. ఆయన ట్యూషన్‌ మాస్టర్‌గా చేస్తున్న ఈ  సినిమాకి ఆనంద్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించాడు. ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడి, ఈ నెల 17న థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనుంది. టి.డి. రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని నిర్మంచగా, నివాస్‌ కె. ప్రసన్న సంగీతం అందించారు.

తెరపైకి  క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌

క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌, నటుడు అర్జున్‌ కథానాయకులు నటించిన చిత్రం ‘ఫ్రెండ్‌షిప్’. జాన్‌పాల్‌ రాజ్‌, శ్యామ్‌ సూర్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కూడా సెప్టెంబరు 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మహిళల్ని ఎలా గౌరవించాలనే అంశం ఆధారంగా రూపొందిన ఈ  చిత్రాన్ని ఎ.ఎన్‌.బాలాజీ నిర్మించారు. తెలుగుతోపాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ‘జెమ్‌’

సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో విజయ్‌రాజా, రాశీసింగ్‌, నక్షత్ర నాయకానాయికలుగా నటించిన చిత్రం ‘జెమ్‌’. పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. ‘రాయలసీమ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సాగే ఈనెల 17న థియేటర్లలో విడుదల విడుదల అవుతోంది.

‘ప్లాన్‌ బి’తో ఉందంటున్న శ్రీనివాసరెడ్డి 

కమెడియన్‌ శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్నచిత్రం ‘ప్లాన్‌ బి’.  కె.వి.రాజమహి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చ్రితానికి ఏవీఆర్‌ నిర్మాత.  మురళీశర్మ, రవిప్రకాష్‌, సూర్య వశిష్ఠ, ముఖ్యపాత్రల్లో నటించారు. నేర నేపథ్యంలో ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాని ఈ నెల 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్‌.

‘హనీట్రాప్‌’ చేసేదెవరు? పడేదెవరు?

దర్శకుడు పి.సునీల్‌ కుమార్‌ రెడ్డి ‘సొంతవూరు’, ‘గల్ఫ్‌’వంటి  చిత్రాలతో తనకంటూ ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకున్నారు. ఆయన కొత్త చిత్రం ‘హనీ ట్రాప్‌’ ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. వివి వామనరావు నిర్మించిన ఈ చిత్రంలో ఆయనే ఓ కీలక పాత్రలో సైతం నటించారు. రిషి, శిల్ప నాయక్‌, తేజు  అనుపోజు, శివ కార్తీక్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రవీణ్‌ ఇమ్మడి స్వరాలందించిన ఈ సినిమాని ఈనెల 17న థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఓటీటీ వేదికగా అలరించనున్న చిత్రాలు, సిరీస్‌లు:

‘మ్యాస్ట్రో’గా వస్తున్న నితిన్‌

నితిన్‌, నభా నటేశ్‌ హీరో, హీరోయిన్స్‌గా నటించిన చిత్రం ‘మ్యాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తమన్నా కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ మూవీ ‘అందాధున్‌’కి రిమేక్‌ వస్తున్న ఈ చిత్రం  ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో సెప్టెంబరు 17 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అంధుడిగా నితిన్‌ నటన ప్రేక్షకులను ఆకట్టకునేలా ఉంది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. మహతి స్వర సాగర్‌ సంగీతం అదించాడు. 

మరో చిత్రంతో విజయ్‌సేతుపతి!

తమిళ నటుడు, మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి నటించిన రెండో సినిమాలు ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన మూడో చిత్రం ‘అనబెల్‌.. సేతుపతి’ ఈ నెల 17న విడుదల కానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానున్న ఈ చిత్రానికి దీపక్‌ సుందర్‌రాజన్‌ దర్శకుడు. సేతుపతికి జోడిగా తాప్సీ పన్ను నటించింది.

ఓటీటీలోకి రానున్న సుశాంత్‌

సుశాంత్‌, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ రొమాంటిక్‌ డ్రామా థ్రిల్లర్‌కి దర్శకుడు ఎస్‌.దర్శన్‌. వెన్నెల కిషోర్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందింది.  కాగా, ఈ సినిమా త్వరలోనే ఓటీటీలో ప్రేక్షకులను పలకరించనుంది. సెప్టెంబరు 17 ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ స్ట్రీమింగ్‌ కానుంది.


అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

♦ డోర్‌ ఏ అండ్‌ మీ -సెప్టెంబరు 17

♦ వీడ్స్‌ - సెప్టెంబరు 15

♦ సెర్చింగ్‌ -సెప్టెంబరు 14

♦ ఆజ్‌ ఎబౌ సో బిలో -సెప్టెంబరు 16


డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

♦ అన్‌ హియర్డ్‌- సెప్టెంబరు 17

♦ కన్ఫెషన్స్‌ ఆఫ్‌ ఎ షోఫాహోలిక్‌- సెప్టెంబరు 17


నెట్‌ఫ్లిక్స్‌

♦ అన్‌కహీ కహానియా- సెప్టెంబరు 17

♦ నైట్‌ బుక్స్‌ -సెప్టెంబరు 15


జీ5

♦ సర్వైవర్‌- సెప్టెంబరు 12(రియాల్టీ షో)

♦ బుక్‌ మై షో - ది సూసైడ్‌ స్క్వాడ్‌ -సెప్టెంబరు 16


సోనీ లైవ్‌

♦ ప్రియురాలు - సెప్టెంబరు 17


హెచ్‌బీవో మ్యాక్స్‌

♦ హథీ మేరీ సాథీ (సెప్టెంబరు 18)

మరిన్ని వార్తలు