ఏపీలో చిత్రపరిశ్రమ అభివృద్ధి కావాలి

11 Dec, 2023 03:52 IST|Sakshi
మోహన్‌ గౌడ్, ఏయం రత్నం, విజయ్‌ వర్మ 

ఏపీ చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు ఏయం రత్నం

ఆంధ్రప్రదేశ్‌ చలన చిత్ర వాణిజ్య మండలి నూతన అధ్యక్షుడిగా నిర్మాత ఏయం రత్నం ఎన్నికయ్యారు. ఆదివారం 5వ వార్షిక సర్వసభ్య సమావేశం, 2023–25 సంవత్సరాలకు నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమం విజయవాడలో జరిగాయి.

నూతన అధ్యక్షుడిగా ఏయం రత్నం, ఉపాధ్యక్షులుగా పి. విజయ్‌ వర్మ, సీహెచ్‌. లక్ష్మీ నరసింహం, మంతా శ్రీనివాస్, కార్యదర్శిగా జేవీ మోహన్‌ గౌడ్, సంయుక్త కార్యదర్శులుగా పి. రమణా రెడ్డి, యన్‌.యస్‌. మూర్తి, కోశాధికారిగా యం. శ్రీనాథరావు, కార్యవర్గ సభ్యులుగా నిర్మాతల విభాగం నుంచి íపీడీఆర్‌. ప్రసాద్‌ రెడ్డి, వీవీ రామానుజం, మిత్తాన ఈశ్వర రావు, యు. వెంకట్‌ రావు, రవీంద్ర గోపాల, పంపిణీదారుల విభాగం నుంచి కె. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ బాబు, ఆర్‌.వి.యన్‌. వరప్రసాద్, మిర్జా అబీద్‌ హుస్సేన్, స్టూడియో విభాగం నుంచి బి. హనుమంతరావు ఎన్నికైనట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఏయం రత్నం మాట్లాడుతూ– ‘‘ఏపీలో కూడా చిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని భావించి, అధ్యక్షుడిగా వ్యవహరించడానికి అంగీకరించాను’’ అన్నారు.

>
మరిన్ని వార్తలు