సంక్రాంతి రేస్‌లో టాప్‌ హీరోలు.. వర్కౌట్‌ అయితే బాక్సాఫీస్‌ షేక్‌ షేకే

1 Aug, 2021 16:31 IST|Sakshi

New Telugu Movies For Sankranthi 2022: సంక్రాంతి పండగ అంటే చాలు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఉత్సాహం వస్తుంది. ప్రతి ఏడాది కొత్త సినిమాలతో ముస్తాబవుతుంది. ఈ సారి కూడా బాక్సాఫీస్‌ సంక్రాంతి సమరానికి తెరలేచింది.కానీ ఈ సంక్రాంతికి ఆడియన్స్‌ మరింత స్పెషల్‌...ఎందుకంటే...రేస్‌లో ఉన్నవారంతా టాప్‌ హీరోలే. బాక్సాఫీస్‌ టాప్‌ లేపేవారే.

సంక్రాంతి సీజన్‌ను క్యాష్‌ చేసుకునేందుకు నిర్మాతలు తమ సినిమాలను ఎప్పటికప్పుడు రెడీ చేస్తుండటం అనవాయితీగా వస్తున్న సంగతే. ఇలా సారి కూడా బాక్సాఫీస్‌ సంక్రాంతి సమరానికి రంగం సిద్ధం అవు తుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో గత ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు వచ్చి సూపర్‌హిట్‌ కొట్టారు మహేశ్‌బాబు. దీంతో 2022 సంక్రాంతికి 'సర్కారువారి పాట'ను రిలీజ్‌ చేయనున్నట్లు మహేశ్‌ ఎప్పుడో చెప్పారు.

ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇలా సంక్రాంతి బరిలో నిలిచిన తొలి చిత్రం 'సర్కారువారిపాట'. పరశురామ్‌ పేట్ల దర్శకత్వం డైరెక్షన్లో రూపొందుతున్న 'సర్కారువారి పాట' చిత్రం బ్యాంకు మోసాల బ్యాక్‌డ్రాప్‌లో సాగుంతుందని తెలుస్తుంది.

మహేశ్‌బాబుతో ఇప్పుడు ప్రభాస్‌ కూడా సంక్రాంతి సమరానికి సై అయ్యారు. రాధాకృష్ణకుమార్‌ డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న 'రాధేశ్యామ్‌' సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. 'రాధేశ్యామ్‌' కొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మహేశ్‌బాబు సర్కారువారి పాట మూవీ విడుదల అయిన తర్వాతి రోజే, అంటే జనవరి 14న ప్రభాస్‌ రాధేశ్యామ్‌ రాబోతోంది. 

సంక్రాంతి సమరంలో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా ఉన్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ రీమేక్‌ పండగ పోటీల్లో ఉంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌-రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నిత్యామేనన్‌-ఐశ్వర్యా రాజేశ్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.


 
ఇక మహేశ్‌, ప్రభాస్‌తో పాటు వెంకటేశ్‌ 'ఎఫ్‌ 3', నాగార్జున 'బంగర్రాజు' రవితేజ 'రామారావు ఆన్‌ డ్యూటీ' చిత్రాలు కూడా సంక్రాంతి రిలీజ్‌కు సంబంధించిన సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నారనే టాక్‌ వినిపిస్తుంది. అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా నటించిన 'ఎఫ్‌ 2' 2019 సంక్రాంతికి బంపర్‌ హిట్‌గా నిలిచింది.

ఇక 2016 సంక్రాంతి టైమ్‌లో నాగార్జున 'సొగ్గాడే చిన్ని నాయానా' సూపర్‌హిట్‌. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న 'బంగర్రాజు' చిత్రం సంక్రాంతి పండక్కే విడుదల చేస్తామని 'వైల్డ్‌డాగ్‌' ప్రమోషన్స్‌లో నాగార్జున చెప్పారు. మరోవైపు రవితేజ కెరీర్‌ను మళ్లీ సక్సెస్‌ ట్రాక్‌లోకి తెచ్చిన 'క్రాక్‌' గత ఏడాది సంక్రాంతికి విడుదలైంది.సో..తమ సక్సెస్‌ సెంటిమెంట్స్‌ను వెంకటేష్, నాగార్జున, రవితేజ ఫాలో అయితే మాత్రం సంక్రాంతి బాక్సాఫీస్‌ పోరు మరింత టఫ్‌గా మారుతుంది.

‘డబ్బింగ్‌’సందడి కూడా ఎక్కువే
సంక్రాంతి పండక్కి టాలీవుడ్‌ బాక్సాఫీసు వద్ద తెలుగు చిత్రాలతో పాటు తమిళ డబ్బింగ్‌ సినిమాలు కూడా రిలీజ్‌ అవుతున్న అనవాయితీ గత మూడేళ్లుగా కనిపిస్తుంది. 2019 సంక్రాంతికి రజనీకాంత్‌ 'పేట', అజిత్‌ 'విశ్వాసం' చిత్రాలు వచ్చాయి. 2020 సంక్రాంతికి రజనీకాంత్‌ 'దర్భార్‌' చిత్రం విడుదలైంది. ఈ ఏడాది సంక్రాంతికి విజయ్‌ 'మాస్టర్‌'గా థియేటర్స్‌లోకి వచ్చాడు. ఈ సినిమా ఫలితం ఎలా ఉన్నా...సంక్రాంతి టైమ్‌లో విడుదలైన ఈ చిత్రానికి మంచి ఓపెనింగ్స్‌ వచ్చాయట. దీంతో మరోసారి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకుల ముందుకు రావాలని విజయ్‌ భావిస్తున్నారట.

ఇందుకు తగ్గట్లుగానే తన తాజా చిత్రం 'బీస్ట్‌' షూటింగ్‌ పనులను ప్లాన్‌ చేస్తున్నారట విజయ్‌. అంతేకాదు..కమల్‌హాసన్‌ నటిస్తున్న 'విక్రమ్‌' కూడా సంక్రాంతికే అన్న టాక్‌ ఇప్పుడైతే కోలీవుడ్‌లో వినిపిస్తుంది. ఇప్పుడైతే సంక్రాంతి సమరానికి చెప్పు కోవడానికి చాలా సినిమాల పేర్లు వినిపిస్తూన్నాయి. కానీ అసలు నిజంగా సంక్రాంతి బరిలో ఉండే సిని మాలు ఏవీ అనేది తెలియడానికి కొంత టైమ్‌ పడుతుంది. ఎందుకంటే..ముందుగా సినిమాల విడుదల తేదీల అనౌన్స్‌మెంట్స్‌ రావడం, ఆ తరవాత అవి తారుమారు అవ్వడం ఇండస్ట్రీలో మాములే.

మరిన్ని వార్తలు