న్యూ ఇయర్‌ వేడుకల్లో బాలీవుడ్‌ జంటలు

30 Dec, 2020 20:05 IST|Sakshi

ముంబై: కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు బాలీవుడ్‌ సెలబ్రిటీలు జంటలుగా విదేశాలకు పయనమవుతుంటారు. ఈ సమయంలోనే ఆయా సెలబ్రిటీల మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ బయటపడుతుంది. తాజాగా ఈ జాబితాలో సిద్దార్థ్‌ మల్హోత్రా-కియారా అద్వానీ, అనన్య పాండే-ఇషాన్‌ కట్టర్లు చేరారు. కొత్త సంవత్సరం వేడుకను జరుపుకునేందుకు ప్రచారంలో ఉన్న ఈ రెండు ప్రేమ జంటలు విడివిడిగా విదేశీ పర్యటనకు బయలుదేరారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే కొద్దికాలంగా కియారా, సిద్దార్థ్‌ మల్హోత్రాలు ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే వారి ప్రేమ వ్యవహరంపై వస్తున్న వార్తలను ఈ జంట కొట్టిపారేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ బీ-టౌన్‌ రోడ్లపై మాత్రం వీరిద్దరూ చక్కర్లు కొడుతూ మీడియా కెమారాలకు చిక్కుతుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం ఈ జంట న్యూ ఇయర్‌ సందర్భంగా మాల్ధీవుల పర్యటనకు వెళుతూ విమానాశ్రయంలో మీడియా కెమారాలకు చిక్కారు. 

అలాగే అనన్య, ఇషాన్‌ల ఎయిర్‌పోర్టు ఫొటోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే వీరి మధ్య ప్రేమయాణం నడుస్తుందంటూ ఇటీవల బీ-టౌన్‌లో వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వార్దిద్దరూ ఎప్పుడు కూడా స్పందించలేదు. అయినప్పటికి అనన్య, ఇషాన్‌లు కలిసి పార్టీలకు, విందులకు జంటగా హజరవుతుంటారు. ఈ క్రమంలో క్యాజువల్‌ వేర్‌లో అనన్య, ఇషాన్‌లు ఎయిర్‌పోర్టులోకి వెళుతూ కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. దీంతో ఈసారి న్యూ ఇయర్‌ను వీరిద్దరూ జంటగా జరుపుకోనున్నారంటూ నెటిజన్‌లు అభిప్రాయపడతున్నారు. అయితే అనన్య, ఇషాన్‌లు ‘ఖాలీపీలీ’లో జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే తామీద్దరం మంచి స్నేహితులం అయ్యామంటూ పలు ఇంటర్వ్యూల్లో అనన్య, ఇషాన్‌లు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు