చిరు 'వాల్తేరు వీరయ్య', 'బాలయ్య వీరసింహారెడ్డి' స్పెషల్‌ పోస్టర్లు చూశారా?

2 Jan, 2023 10:29 IST|Sakshi

నూతన సంవత్సరం (2023) వచ్చింది. కొత్త పోస్టర్లను తెచ్చింది.. సినీ లవర్స్‌కి ఆనందాన్ని ఇచ్చింది... ఇక ఆ కొత్త అప్‌డేట్స్‌పై ఓ లుక్కేద్దాం....

చిరంజీవి హీరోగా బాబీ కొల్లి (కేఎస్‌ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో హీరో రవితేజ కీలక పాత్ర చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మింన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 13న విడుదలకానుంది. న్యూ ఇయర్‌ సందర్భంగా ఈ చిత్రం నుంచి చిరంజీవి కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది యూనిట్‌. అదేవిధంగా బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ జంటగా నటించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వై.రవిశంకర్, నవీన్‌ యెర్నేని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది.

ఈ మూవీ నుంచి బాలకృష్ణ, శ్రుతీహాసన్‌ లేటెస్ట్‌ పోస్టర్‌ని యూనిట్‌ రిలీజ్‌ చేసింది. ఈ మూవీలోని ‘మాస్‌ మొగుడు..’ అంటూ సాగే పాటని ఈ నెల 3న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది. కాగా నాగచైతన్య హీరోగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కస్టడీ’. కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఒక స్పెషల్‌ గ్లింప్స్‌ని విడుదల చేశారు మేకర్స్‌. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. అలాగే హీరో అఖిల్‌ నటింన మూవీ ‘ఏజెంట్‌’. డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో సాక్షీ వైద్య హీరోయిన్‌. ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్, సురేందర్‌ 2 బ్యానర్స్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలకావాల్సి ఉంది.. అయితే వేసవిలో రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రయూనిట్‌ పేర్కొంటూ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది.

అదేవిధంగా ‘బింబిసార’ వంటి హిట్‌ చిత్రం తర్వాత కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అమీగోస్‌’. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ ఫిబ్రవరి 10న రిలీజ్‌ చేయనున్నట్లు పేర్కొంటూ కల్యాణ్‌ రామ్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. కాగా ‘అర్జున్‌ రెడ్డి’ ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రం యానిమల్‌’. రణ్‌బీర్‌ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. టీ సీరీస్, భద్రకాళీ పిక్చర్స్‌పై భషణ్‌ కుమార్, ప్రణయ్‌ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినివ ఫస్ట్‌ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. వీటితో ΄ాటు మరికొన్ని సినిమాల కొత్త పోస్టర్స్, కొత్త అప్‌డేట్స్‌ని ఇచ్చాయి చిత్రవర్గాలు.

మరిన్ని వార్తలు