భర్తపై ప్రముఖ నటి ఫిర్యాదు, అరెస్ట్‌

22 Sep, 2020 19:35 IST|Sakshi

పెళ్లయిన కొద్దిరోజులకే విభేదాలు

పనాజీ : వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే నటి పూనం పాండే మరో వివాదంతో ముందుకొచ్చారు. తన భర్త తనను లైంగికంగా వేధిస్తున్నారని, బెదిరింపులకు గురిచేస్తున్నారని పూనం ఇచ్చిన ఫిర్యాదుపై ఆమె భర్త సామ్ బాంబేను గోవాలో పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పూనం ప్రస్తుతం దక్షిణ గోవాలోని కనకోనా గ్రామంలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొంతకాలంగా ప్రేమిస్తున్న తన బాయ్ ఫ్రెండ్ సామ్ బాంబేను ఈ నెల 1న పూనమ్‌ పాండే పెళ్లి చేసుకున్నారు. తన భర్త సాం బాంబే తనను వేధిస్తున్నారని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారని పూనం పాండే సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారని, వెంటనే నిందితుడిని అరెస్ట్‌ చేశామని కనకోనా పోలీస్‌స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ తుకారాం చవాన్‌ చెప్పారు.

కేసు నమోదు చేసి బాధితురాలిపై వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మోడల్‌ నుంచి నటిగా ఎదిగిన పూనం ఈనెల 10న తన పెళ్లి ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.  మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ బాంబే అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్‌ ఇచ్చిన పూనం ఇంతలోనే భర్తపై ఫిర్యాదు చేయడం, శాం బాంబేను పోలీసులు అరెస్ట్‌ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇక మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన పూనమ్‌  2013లో నాషాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. సినిమాల కంటే వివాదాస్పద వ్యాఖ్యలతో పబ్లిసిటీ పొందుతూ వచ్చారు. దీని కారణంగానే సోషల్ మీడియాలో మంచి ఇమేజ్ సంపాదించారు. జూలై 27న బాయ్‌ప్రెండ్‌ సామ్‌తో పూనమ్‌ నిశ్చితార్థం చేసుకున్నారు. చదవండి : ఏడడుగులు వేసిన వేళ

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా