అప్పుడు ప్రియాంకతో మాట్లాడే పరిస్థితిలో లేను: నిక్‌ జోనస్‌

29 May, 2021 13:11 IST|Sakshi

తొలిసారిగా ప్రమాదంపై స్పందించిన నిక్‌ జోనస్‌

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా భర్త, అమెరికన్‌ పాప్‌ సింగర్‌ నిక్ జోనస్ ఇటీవల లైవ్‌ షో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. లాస్‌ ఏంజెల్స్‌లోని ది వాయిస్‌ రియాలిటీ షో షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో నిక్‌కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో హాస్పిటల్‌లో జాయిన్ చేయగా కొద్ది రోజుల కిందట డిశ్చార్జ్‌ అయ్యి ఇంటికి వచ్చాడు. అనంతరం వెంటనే యథావిధిగా ‘ది వాయిస్‌’ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో అక్కడి స్థానిక ఛానల్‌ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నిక్‌ తనకు జరిగిన ప్రమాదంపై తొలిసారిగా స్పందించాడు. అయితే నిక్‌ గాయపడిన అనంతరం తన భార్య ప్రియాంకకు ఈ సమాచారం అందించేందుకు ముందుగా మీ ఫోన్‌ ఎవరికి ఇచ్చారని హోస్ట్‌ అడగ్గా.. వెంటనే నిక్‌ తన పెద్ద అన్నయ్య కెవిన్‌ జోనస్‌కు ఇచ్చానని వెల్లడించాడు. 

దీనిపై నిక్‌ మాట్లాడుతూ.. ‘స్వయంగా నేనే ఈ విషయాన్ని ప్రియాంకతో చెప్పే పరిస్థితుల్లో లేను. నేను పడిపోగానే మెడికల్‌ టీం నా చూట్టు చేరింది. ఆస్పత్రికి తరలించేందుకు నన్ను హడావుడిగా గుర్నిపైకి ఎక్కించి అంబులెన్స్‌ దగ్గరికి తీసుకేవెళుతున్నారు. దీంతో ప్రియాంకతో నేను మాట్లాడే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో అప్పుడు కెవిన్‌ నాకు ఎదురుగా ఉన్నాడు. దీంతో నా ఫోన్‌ తీసి ప్రియాంకకు విషయం చెప్పమని ఇచ్చాను’ అంటూ నిక్‌ చెప్పుకొచ్చాడు. కేవిన్‌ జోనస్‌, జో జోనస్‌ కంటే నిక్‌ చిన్నవాడు. ఇక కేవిన్‌ మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన గురించి ప్రియాంక చెప్పుతుండగా నా నోటి నుంచి మాటలు రాలేదు. నేను అన్నయ్యనే అయినప్పటికి వారికి తండ్రి స్థానంలో ఉన్నాను. ఓ తండ్రి తన పిల్లలను అలాంటి పరిస్థితుల్లో చూసి సాధారణంగా ఉండలేడు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు