ఆసుపత్రిలో చేరిన ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్‌

17 May, 2021 13:09 IST|Sakshi

గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా భర్త, ప్రముఖ హాలీవుడ్ గాయకుడు నిక్ జోనస్ ఆసుత్రిలో చేరినట్లు తెలుస్తోంది. లాస్‌ ఏంజెల్స్‌లో శనివారం రియాలిటీ షో ‘ది వాయిస్‌’ షూటింగ్ చేస్తున్న సమయంలో నిక్‌కు స్వల్ప గాయాలయినట్లు, దీంతో అతన్ని వెంటనే హాస్పిటల్‌లో జాయిన్ చేసినట్లు సమాచారం.  గాయాలు పెద్ద‌వేమి కాక‌పోవ‌డంతో డాక్టర్ల చికిత్స అనంతరం ఆదివారం డిశ్చార్జ్‌ అయినట్లు వినికిడి. నిక్ యదావిధిగా సోమవారం మాత్రం తన రియాలిటీ షో ‘ది వాయిస్’లో పాల్గొనబోతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. అయితే అతనికి గాయాలు ఎలా అయ్యాయనే విషయం తెలియరాలేదు.

కాగా 2018లో ప్రియాంక, ప్రముఖ అమెరికన్ గాయకుడు నిక్ జొనాస్‌ను ప్రియాంక ప్రేమించి పెళ్లి చేసున్న విషయం తెలిసిందే. ప్రియాంక కంటే నిక్‌ పదేళ్లు చిన్న వాడు. ప్రస్తుతం వీరిద్దరూ తమతమ వృత్తుల్లో బిజీగా ఉ‍న్నారు. ప్రియాంక తన ప్రాజెక్ట్స్‌ కోసం లండన్‌, నిక్‌ జోనస్‌ లాస్‌ ఏంజెల్స్‌లో ఉంటున్నాడు. మరోవైపు భారత్‌లో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో ప్రియాంకా చోప్రా, తనభర్త నిక్‌ జోనాస్‌ కలిసి కోవిడ్‌ బాధితుల కోసం ‘టుగెదర్‌ ఇండియా’ అంటూ విరాళాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు