వామ్మో..నిధి అగర్వాల్‌ వేసుకున్న చెప్పులు అన్ని వేలా?

1 Aug, 2021 12:28 IST|Sakshi

స్టార్‌ స్టయిల్‌

నిధి అగర్వాల్‌.. వైవిధ్యమైన ఆలోచన, ఆచరణే ఆమె విజయ రహస్యం. ఫ్యాషన్‌లోనూ అదే ఫార్ములా! ఆమె ఫేవరేట్‌ బ్రాండ్సే నమూనా!!

స్టార్స్‌కు ఎస్‌వీఏ ఫేవరేట్‌
'సోనమ్‌, ప్రకాశ్‌ మోదీ అనే ఇద్దరు డిజైనర్స్‌ కలసి స్థాపించిన సంస్థ ఎస్‌వీఏ. దాదాపు ఏడు సంవత్సరాలుగా ఎవర్‌ గ్రీన్‌  డిజైన్స్‌ను అందిస్తున్నారు. అదే వీరి బ్రాండ్‌ వాల్యూని పెంచింది. డిజైన్స్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో.. ఫ్యాబ్రిక్కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. నాణ్యమైన వస్త్రాల కోసం ముంబైలో ఓ  పరిశ్రమనే  స్థాపించారు. అక్కడ తయారైన ఫ్యాబ్రిక్‌తో మాత్రమే వీరు  డిజైన్స్‌ చేస్తారు. అందుకే చాలా మంది స్టార్స్‌కు ఎస్‌వీఏ ఫేవరేట్‌. విదేశాల్లో కూడా వీరి దుస్తులకు మంచి గిరాకీ ఉంది. డిజైనర్‌ పీస్‌ కాబట్టి కాస్త ఎక్కువగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. పలు ప్రముఖ ఆన్‌లైన్‌ స్టోర్స్‌లో ఈ బ్రాండ్‌  డిజైన్స్‌ లభిస్తాయి. 

నీతా బూచ్రా..
ప్రసిద్ధ బంగారు ఆభరణాల వ్యాపారి లలిత్‌ కుమార్‌ బూచ్రా వారసురాలు. నగల మీదున్న మోజుతో  జ్యూయెలరీ డిజైనర్‌గా మారింది నీతా. స్టార్స్‌ కోసం ప్రత్యేకంగా ఆభరణాలను డిజైన్‌ చేస్తుంది.  ప్రియాంక చోప్రా, విద్యా బాలన్‌ వంటి సెలబ్రిటీస్‌కు ఆమె అభిమాన డిజైనర్‌.  జైపూర్‌లో ‘నీతా బూచ్రా జ్యూయెలరీ ’ పేరుతో బంగారం, వెండి, వజ్రాల ఆభరణాల దుకాణం ఉంది.  కేవలం డిజైన్‌ ఆధారంగానే ఆభరణాల ధర నిర్ణయిస్తారు. పలు ప్రముఖ ఆన్‌ లైన్‌ స్టోర్స్‌లో ఈ డిజైన్స్‌ లభిస్తాయి. ఏది కొనాలన్నా రూ. వేల నుంచి లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. 

క్రిస్ట్యా లుబుటా 
టాప్‌ మోస్ట్‌ లగ్జూరియస్‌ ఫ్యాషన్‌ బ్రాండ్స్‌లో క్రిస్ట్యా లుబుటా  ఫుట్‌వేర్‌ ఒకటి.  దాదాపుగా ప్రతి హాలీవుడ్‌ స్టార్‌ దగ్గర దీని కలెక్షన్‌ ఉంటుంది. 1991లో మొదలైన ఈ సంస్థను ది గ్రేట్‌ డిజైనర్‌ క్రిస్ట్యా లుబుటా స్థాపించారు. ఫ్యాషన్‌ వరల్డ్‌ .. ప్యారిస్‌లో దీని మెయిన్‌ బ్రాంచ్‌ ఉంది. ఇప్పటి వరకు సుమారు ఆరు లక్షల ఫుట్‌వేర్‌ డిజైన్స్‌ను ఈ సంస్థ అందించింది. ఈ బ్రాండ్‌కు ప్రపంచమంతా  స్టోర్స్‌  ఉన్నాయి. 
ఈ ఫుట్‌వేర్‌ ఖరీదు చాలా చాలా ఎక్కువ. పలు ప్రముఖ ఆన్‌ లైన్‌ స్టోర్స్‌లోనూ  దొరుకుతాయి. 

బ్రాండ్‌ వాల్యూ 
డ్రెస్‌ బ్రాండ్‌: ఎస్‌వీఏ 
ధర: రూ. 65,000
జ్యూయెలరీబ్రాండ్‌: నీతా బూచ్రా జ్యూయెలరి 
ధర: డిజైన్‌ పై ఆధారపడి ఉంటుంది. 

ఫుట్‌వేర్‌ బ్రాండ్‌: ఐరిజ క్రిస్ట్యా లుబుటా పంప్స్‌ 
ధర:రూ. 55,567
ఎవరైనా రకరకాల షూస్‌ ఇష్టపడ్తారు.  నాకైతే రకరకాల సాక్స్‌  ఇష్టం.  ఎప్పుడూ ఒకేరకమైన సాక్స్‌ ధరించను. నా దగ్గర వివిధ బ్రాండ్స్‌  సాక్స్‌ కలెక్షన్‌ ఉంది.– నిధి అగర్వాల్‌

-దీపిక కొండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు