ఆడియో ఫంక్షన్‌లో ఇస్మార్ట్‌ బ్యూటీకి చేదు అనుభవం

5 Jan, 2021 12:33 IST|Sakshi

ఇస్మార్ట్‌ శంకర్‌ ఫేం‌, హాట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌కు చేదు అనుభవం ఎదురరైంది. హీరో శింబుతో కలిని నిధి అగర్వాల్‌ ఈశ్వరన్‌ అనే తమిళ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ప్రముఖ నిర్మాత బాలాజీ కబా నిర్మించిన ఈ చిత్రానికి సుశీంద్రన్‌ దర్శకత్వం వహించారు. కె.భారతీరాజా వంటి సీనియర్‌ స్టార్‌ డైరెక్టరు కీలకమైన పాత్ర పోషించగా, నందితా శ్వేత, ఇతర తారాగణం నటించారు. కాగా, ఇటీవల జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో చిత్ర దర్శకుడు ఆమెను కాస్త ఇబ్బంది పెట్టాడు. దీంతో ఈ ఇష్యూ కోలివుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

అసలు ఏం జరిగిందంటే..
సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ఈశ్వరన్‌  ఆడియో ఫంక్షన్ జరిగింది. ఇందులో హీరోయిన్ నిధి అగర్వాల్ స్టేజీపై మాట్లాడుతుండగా.. దర్శకుడు సుశీంద్రన్ పదే పదే మధ్యలో కలుగజేసుకుంటూ 'శింబు మామ ఐ ల‌వ్యు' అని చెప్పు అంటూ అడ్డుపడుతూ బలవంత పెట్టారు. దీంతో నిధి కాస్త ఇబ్బంది పడినట్లుగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. వీడియో చూసిన నెటిజన్లు దర్శకుడి ప్రవర్తనను తప్పుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ ఇష్యూపై దర్శకుడు సుశీంద్రన్ స్పందిస్తూ.. సినిమాలో శింబును ఉద్దేశించి నిధి 'మామా ఐ ల‌వ్యూ' అని చెప్పే డైలాగ్ ఉంటుంద‌ని, దాన్ని హైలైట్ చేద్దామనే ఆడియో ఫంక్షన్‌లో అలా చెప్ప‌నని వివరణ ఇచ్చారు. కాగా, ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది.

మరిన్ని వార్తలు