బర్త్‌డే లుక్‌

18 Aug, 2020 01:43 IST|Sakshi

నటుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్‌ గల్లా కుమారుడు అశోక్‌ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నిధీ అగర్వాల్‌ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నిధీ అగర్వాల్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

‘‘ఈ సినిమా కోసం చేసిన కృష్ణగారి ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే..’ సాంగ్‌  రీమిక్స్‌ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్‌ పూర్తయింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్‌ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపూటి.

మరిన్ని వార్తలు