మహేశ్‌తో జతకట్టనున్న ‘ఇస్మార్ట్‌’ బ్యూటీ!

24 Apr, 2021 18:51 IST|Sakshi

‘సవ్యసాచి’ మూవీతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచమైన నిధి అగర్వాల్‌ ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమాతో ఒక్కసారిగా పాపులర్‌ అయ్యింది. తన రెండవ సినిమా ‘మిస్టర్‌ మజ్ను’తో అక్కినేని వారసుడు అఖిల్‌తో జత కట్టిన ఈ భామ తన నటనతో మంచి మార్కులు కొట్టెసింది. ఈ క్రమంలో ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుని అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. దీంతో ఆమెకు కోలీవుడ్‌ ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. దీంతో ప్రస్తుతం నిధి తెలుగు, తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది.

కాగా క్రిష్‌ దర్శకత్వంలో పవర్‌ స్టార్ పవన్‌‌ కల్యాణ్‌‌ హీరోగా ‘హరిహర విరమల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో పవన్‌కు జోడిగా నిధి నటించనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఆమెకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్‌ న్యూస్‌ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే నిధి సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో జతకట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్‌‌ పరుశురాం దర్శకత్వంలో మహేశ్‌ ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు కరోనా కారణంగా చిన్న బ్రేక్‌ వచ్చింది.

ఇందులో మహేశ్‌ సరసన కీర్తి సురేశ్‌ నటిస్తోంది. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మహేశ్‌ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా బుట్టబోమ్మ పూజ హెగ్డెను సంప్రదించినట్లు ఇటీవల వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో మహేశ్‌కు జోడివగా నిధి అగర్వాల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా పూజాను తీసుకోవాలనుకున్న చిత్ర బృందం తాజా నిధి పేరును ప్రతిపాదిస్తున్నట్లు తాజాగా తెరపైకి వచ్చింది. అయితే ఈ మూవీ నిధి మెయిన్ రోల్‌లో కనిపించనుందా లేదా సెకండ్ హీరోయిన్‌గా కనువిందు చేయనుందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

చదవండి: 
నా విస్కీకి నాలుగేళ్లు : హీరోయిన్‌ అనుపమ
నందు యాక్టింగ్‌పై భార్య గీతా మాధురి కౌంటర్!‌‌‌

మరిన్ని వార్తలు