హ్యాపీ బర్త్‌డే బంగారు.. ఐ లవ్‌ యూ..

13 Jan, 2021 19:21 IST|Sakshi

పెళ్లి చేసుకుని అత్తారింటిలో అడుగుపెట్టిన మెగా డాటర్‌ నిహారిక కొణిదెలకు సంబంధించిన ప్రతి విషయం ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె మేనబావ, సాయి ధరమ్‌ తేజ్‌ సోదరుడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ బర్త్‌ డే సందర్భంగా నిహారిక చేసిన ట్వీట్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బుధవారం (జనవరి 13) వైష్ణవ్‌ పుట్టిన రోజు సందర్భంగా నీహ... ‘హ్యాపీ బర్త్‌డే బంగారు!! నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు.. నువ్వు సినిమా ఇండస్ట్రీలో స్టార్‌ హీరోగా రాణించాలని ఆశిస్తున్న. ఆల్‌ ద వెరీ బెస్ట్‌ వైష్‌గా’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా, వైష్ణవ్‌ పుట్టిన రోజు సందర్భంగా అతడు హీరోగా వస్తున్న ‘ఉప్పెన’ మూవీ టీజర్‌ ఇవాళ విడుదలైంది. (చదవండి: అనసూయ ట్వీట్‌‌.. మెగా ఫ్యామిలీలో కలకలం!)

కాగా వైష్ణవ్‌ నీహరికకు మేనబావ అనే విషయం తెలిసిందే. మెగా కుటుంబంలో బావలు, మరదళ్లు అనే తేడా లేకుండా అందరూ అన్నాచెల్లెల్లుగా మెలుగుతుంటారు. ప్రతి వేడుకకు అందరూ ఒకచోట చేరి సందడి చేస్తుంటారు. కాగా గతేడాది జొన్నలగడ్డ చెతన్యతో నిహారిక వివాహం రాజస్తాన్‌ జోధ్‌పూర్‌ ప్యాలేస్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి తన భర్త చైతన్యతో కలిసి సందడి చేస్తున్న ఫొటోలతో పాటు జిమ్‌కు, షికార్లకు వెళ్లిన ఫొటోలను ఆమె ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ యాక్టివ్‌ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఈ కొత్త జంట వివాహం ఇటీవల హానీమూన్‌కు మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. (చదవండి: చాలా ఎగ్జయిటెడ్‌గా ఉన్నాను : నిహారిక)

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు