Niharika Konidela: మా ఆయనకు నేను సినిమాలు చేయడం ఇష్టం

25 Nov, 2021 15:56 IST|Sakshi

Niharika Konidela About Quitting Movies: మెగా తారల గారాల పట్టి నిహారిక కొణిదెల. అల్లరితో, యాక్టింగ్‌తో అలరించిన ఈ నటి నిర్మాతగానూ సత్తా చాటుతోంది. తాజాగా ఓ టీవీ కార్యక్రమంలో పాల్గొన్న నిహారిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఒక యాక్టర్‌గా తనకు చిరంజీవిగారే స్ఫూర్తి అని చెప్పింది. హీరోయిన్లకు పెళ్లయినా కెరీర్‌ ఏం మారడం లేదని అందుకు సమంతను ఉదాహరణగా పేర్కొంది. సమంతకు పెళ్లికి ముందు ఎంత క్రేజ్‌ ఉండేదో, పెళ్లయ్యాక కూడా అలాగే ఉందని చెప్పుకొచ్చింది. ఇక తన గురించి చెప్తూ భర్త చైతన్యకు తాను సినిమాలు చేయడం ఇష్టమని, అందుకే మూవీస్‌ కంటిన్యూ చేశానంది.

సినిమాలు కాకుండా ఏదైనా చేద్దామని టీచ్‌ ఫర్‌ ఇండియా అనే కార్యక్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పానంది. అయినా మూవీస్‌పై ఇష్టంతో ప్రొడక్షన్‌ స్టార్ట్‌ చేశానని చెప్పుకొచ్చింది. ముద్దపప్పు ఆవకాయ్‌, నాన్నకూచీలతో పాటు యంగ్‌స్టర్స్‌తో కలిసి స్నేహంపై ఓ వెబ్‌సిరీస్‌ తీశానన్న నిహారిక ఇటీవలే 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కేవలం ప్రొడక్షనే కాకుండా యూట్యూబర్‌ నిఖిల్‌తో కలిసి ఓ సూపర్‌ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నానన్న ఆమె దానికి సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

చదవండి: Uttej Very Emotional Words: చాలా నొప్పిగా ఉంది పద్దూ.. ఉత్తేజ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

మరిన్ని వార్తలు