Niharika Konidela: ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ డిలీట్‌ చేసిన మెగా డాటర్‌..

7 Mar, 2022 18:48 IST|Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల గుర్తించి పరిచయం చేయాల్సిన పనిలేదు. యాంకర్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మెగా డాటర్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయినా వెబ్‌సిరీస్‌లు, సినిమాల్లో నటించి  తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. 2020, డిసెంబర్‌9న చైతన్య జొన్నలగడ్డని వివాహం చేసుకొని అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు ప్రొఫెషనల్‌ లైఫ్‌ని బ్యాలెన్స్‌ చేస్తుంది.

ఇటీవలె ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించి ప్రొడ్యూసర్‌గానూ అవతరించింది. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ, తన సినిమా విశేషాలతో పాటు ఫ్యామిలీ ఫోటోలను కూడా షేర్‌ చేసుకునేది. కానీ అనూహ్యంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ని డిలీట్‌ చేసింది. సోషల్‌ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా కనిపించే నిహారికి సడెన్‌గా అకౌంట్‌ డిలీట్‌ చేయడం ఏంటని నెటిజన్లు ఆరా తీశారు.

అయితే రీసెంట్‌గా జిమ్‌లో నిహారిక షేర్‌ చేసిన ఓ వీడియోపై ట్రోల్స్‌ రావడంతో అకౌంట్‌ డిలీట్‌ చేసినట్లు టాక్‌ వినిపిస్తుంది. మరి అకౌంట్‌ తొలగించడానికి  ఇదే కారణమా లేక మరేదైన కారణం ఉందా అన్నది తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు