వైభ‌వంగా నిహారిక నిశ్చితార్థం

13 Aug, 2020 21:15 IST|Sakshi

సాక్షి, హైద‌రాబాద్‌: ముందుగా అనుకున్న తేదీ ప్ర‌కార‌మే కొణిదెల నాగబాబు కుమార్తె నిహారిక కొణిదెల-చైత‌న్యల‌ నిశ్చితార్థం నేడు హైద‌రాబాద్‌లో ఘ‌నంగా జ‌రిగింది. గురువారం రాత్రి ఇరు కుటుంబాల స‌మ‌క్షంలో జ‌రిగిన ఈ ఎంగేజ్‌మెంట్‌కు అతి కొద్ది మంది అతిథులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. నిహారిక జంటకు ఇరువైపులా నాగ‌బాబు, చిరంజీవి ఫ్యామిలీ క‌లిసి దిగిన ఫొటో అభిమానుల‌ను విశేషంగా ఆక‌ర్షిస్తోంది. వీరి నిశ్చితార్థ సంబ‌రానికి మెగాప‌వ‌ర్ స్టార్ రామ‌చ‌ర‌ణ్ స‌తీస‌మేతంగా విచ్చేశారు. అల్లు అర్జున్‌తో పాటు సాయిధ‌ర‌మ్‌తేజ్ కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. (కాబోయే భర్త ఫోటో షేర్‌ చేసిన నిహారిక!)

మెగా ఫ్యామిలీ అంతా ఒకే ఫ్రేములో ఉన్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఇక‌ ఎంగేజ్‌మెంట్‌కు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రూ మాస్కులు పెట్టుకునే క‌నిపించారు. చిరంజీవి, ఆయన స‌తీమ‌ణి కూడా మాస్కులు పెట్టుకుని కోవిడ్ జాగ్ర‌త్త‌ల‌ను పాటించారు. అయితే బంధువుల‌తో స‌ర‌దాగా మాట్లాడే స‌మ‌యంలో మాత్రం మాస్కు తీసేసి క‌నిపించారు. కాగా నిహారికది అరేంజ్‌డ్ మ్యారేజ్‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూరు పోలీసు శాఖ‌లో ఐజీగా విధులు నిర్వ‌ర్తిస్తున్న జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర్ కుమారుడు చైత‌న్య‌తో ఏడ‌డుగులు వేయ‌బోతున్నారు. ఆయ‌న హైద‌రాబాద్‌లోని ఓ ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా