డిసెంబర్‌లో నిహారిక పెళ్లి.. ఏర్పాట్ల బాధ్యత వరుణ్‌దే

17 Oct, 2020 12:47 IST|Sakshi

మెగా కుటుంబంలో రెండు నెలల్లో పెళ్లి బజాలు మొగనున్నట్లు సినీ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డిసెంబర్‌లో నిహారిక కొణిదెల, చైతన్యల వివాహం చేసుకుబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే మెగా ఫ్యామిలిలో పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా కేవలం కుటుంబ సభ్యులు, స్నేహితులు, దగ్గరి బంధువుల సమక్షంలో నిహారిక-చైతన్యల వివాహం జరగనుంది. ఇదిలా ఉండగా ఆగష్టు 13న ఈ జంట నిశ్చితార్థం చేసుకోగా ఈ కార్యక్రమానికి రామ్‌ చరణ్‌-ఉపాసన, అల్లు అర్జున్‌- స్నేహ, సాయిధరమ్‌తోపాటు కుటుంబ సభ్యులు హాజరైన విషయం తెలిసిందే. చదవండి: ఇక సమయం లేదు ప్రియతమా!

పెళ్లికి ఎవరిని ఆహ్వనించాలనే విషయంలో నాగబాబు దంపతులు బిజీగా ఉండగా.. పెళ్లి పనులన్నింటిని నిహారిక సోదరుడు, హీరో వరుణ్‌తేజ్‌ దగ్గరుండి చూసుకుటుంన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వెలుపల గ్రాండ్‌గా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కు వరుణ్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌. ఇందుకు రెండు, మూడు ప్రదేశాలను ఆలోచిస్తున్నాడని, ఈ నెలాఖరులోగా తుది నిర్ణయం తీసుకోనుట్లు తెలుస్తోంది. ఇంకేముంది త్వరలోనే  చైతన్యతో నిహారిక ఏడడుగులు వేయనున్నారు. మరోవైపు ఇప్పటికే టాలీవుడ్‌ నటులు రానా, నితిన్‌, నిఖిల్‌, వంటి వారంతా ఓ ఇంటి వారవడంతో నిహారిక పెళ్లి ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: నిహారిక స్థానంలో మేఘా ఆకాశ్‌

మరిన్ని వార్తలు