నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్‌ సేతుపతి

26 Feb, 2021 13:23 IST|Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల న‌టిస్తోన్న ఓ మూవీ త్వరలో విడుదలకు సిద్దమైంది. ‘ఓ మంచి రోజు చూసి చెప్తా’ అనే టైటిట్‌ను ఖారారు చేసి మార్చి 19వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ తాజాగా ప్రకటిచింది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. అపోలో సంస్థ బ్యానర్‌లో నిర్మిస్తున్న ఈ మూవీలో ఇందులో తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్నారు. శుక్రవారం ట్విటర్‌లో షేర్‌ చేసిన ఈ పోస్టర్‌లో నిహారిక యువరాణిగా .. విజ‌య్ సేతుప‌తి యమధర్మరాజుగా కనిపించారు.

ఈ పోస్టర్‌లో విజయ్‌ కొత్తలుక్‌ ఆసక్తికరంగా ఉంది. గతేడాది నిహారిక చైతన్య జోన్నలగడ్డను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత విడుదల అవుతున్న ఆమె మొదటి చిత్రం ఇది. కాగా ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ చిత్రంలో హరోయిన్‌ తండ్రి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్ష‌కుల‌కు మ‌రింత ద‌గ్గ‌రైన విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో యమధర్మ రాజుగా తెలుగు ప్రేక్షకుల అల‌రించ‌డానికి సిద్ధ‌మైనట్లు తెలుస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు