‘నాన్నకు ఆ ఒక్క విషయం తెలియదు!’ నిహారిక వీడియో వైరల్‌

18 Jun, 2021 18:01 IST|Sakshi

మెగా బ్రదర్‌ నాగాబాబు, మెగా డాటర్‌ నిహారికలు తాజాగా ఓ ప్రకటనలో నటించారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌పై అవగాన కల్పిస్తూ ప్రమోట్‌ చేసిన ఈ ప్రకటన వీడియోను తాజాగా నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇందులో తండ్రికూతుళ్లకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చెబుతూ ఈ ప్రకటనను ప్రమోట్‌ చేసిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఇందులో నిహారిక తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోతో ఈ వీడియో ప్రారంభం మొదలవుతుంది. ఆ తర్వాత నిహారిక తండ్రి నాగబాబు గురించి చెప్పుకొస్తుంది. ఆమె చిరు నవ్వులు చిందిస్తూ ‘చిన్నప్పటి నుంచి నాన్న నాకు రక్షణ కవచంలా ఉన్నారు. నటుడిగా, రైటర్‌గా, నిర్మాతగా ఆయన నన్ను ఇన్‌స్పైర్‌ చేస్తూనే ఉన్నారు. జీవితంలో అన్ని పాత్రలను ఆయన విజయవంతంగా పోషించారు. ఒక్క ఆన్‌లైన్‌ ట్రాన్స్‌యాక్షన్‌ తప్పా’ అంటూ ఈ ప్రకటన సాగుతుంది.

ఇక నాగబాబు ఇందులో ట్రాన్స్‌యాక్షన్‌ ఎలా చేయాలో తెలియక నిహారికను అడుగుతాడు. దీంతో ఆమె నవ్వుతూ.. ఇంకా ఈ అకౌంట్‌ డీటెయిల్స్ అవసరం లేదని, మీ దగ్గర వాళ్ల ఫోన్ నంబర్స్ ఉన్నాయా? అది చాలు అంటూ ఐసీఐసీఐ మొబైల్ బ్యాంకింగ్ గురించి ఇద్దరూ ప్రమోట్ చేశారు. కాగా నిహారిక గతేడాది డిసెంబర్‌ 9న చైతన్యను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం భర్త‌ చైతన్యతో కలిసి వైవాహిక​ జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తుంది. అలాగే వృత్తిపరంగానూ ఫోకస్‌ పెట్టింది.  పెళ్లి తర్వాత ఓ వెబ్‌సిరీస్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన నిహారిక..ఇటీవలె ఓ సినిమాకి కూడా సైన్‌ చేసిందని సమాచారం.

A post shared by Niharika Konidela (@niharikakonidela)

మరిన్ని వార్తలు