భార్య కోసం వంట చేసిన నిహారిక భర్త

11 Jun, 2021 12:17 IST|Sakshi

మెగా డాటర్‌ నిహారిక కొణిదెల సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం నిహారిక-చైతన్య తమ దాంపత్య జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు. భర్తతో గడిపిన ప్రత్యేక క్షణాలను నిహారిక ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంటోంది. అలాగే ఫన్నీ వీడియోలు, కొత్తరకం వంటకాల వీడియోaను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటుంది. అయితే ఈసారి నిహారిక కోసం ఆమె భర్త చైతన్య వంటగదిలోకి దూరిపోయాడు.

భార్య కోసం చోరిజో స్పానిష్ రైస్‌ అనే డిష్‌ను స్వయంగా తన చేత్తో వండి తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలను నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఇక తేడాది డిసెంబర్‌9న నిహారిక-చైతన్యల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌లో కుటుంబ సభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఇక పెళ్లి త‌ర్వాత వృత్తిపరంగానూ ఫోకస్‌ పెట్టిన నిహారిక ఇప్పటికే ఓ వెబ్‌సిరీస్‌కు సైన్‌ చేసిన సంగతి తెలిసిందే. 

చదవండి :నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్‌ కామెంట్స్‌ !
నిహారిక కాలికి గాయం..సేవలు చేస్తున్న చైతన్య

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు