నిహారిక ఫోన్‌లో వైష్ణవ్‌ తేజ్‌ పేరు ఏమని ఉంటుందో తెలుసా?

6 Jul, 2021 12:52 IST|Sakshi

మెగా డాటర్‌ నిహారిక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినిమా కబుర్లతో పాటు వ్యక్తిగత విషయాలను ఎప్పుటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. ప్రస్తుతం భర్త జొన్నలగడ్డ చైతన్యతో కలిసి వెకేషన్‌ ట్రిప్‌లో సందడి చేస్తోంది. భర్తతో కలిసి టూర్‌లు చుట్టోస్తూ.. మ్యారేజ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తోంది. తాజాగా చైతన్య- నిహారిక జంట వెకేషన్ ట్రిప్‌లో భాగంగా పాండిచ్చేరి అందాలను ఆస్వాదిస్తున్నారు.కాగా ప్రస్తుతం నిహారిక పాండిచ్చేరిలో దిగిన ఫోటోలు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే నిహారిక ఇటీవలె ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో ముచ్చటించింది.

ఈ సందర్భంగా ఫ్యాన్స్‌ అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబిచ్చింది. ఇందులో ఓ నెటిజన్‌..వైష్ణ‌వ్ తేజ్ పేరును మీ ఫోన్ కాంటాక్ట్ నేమ్స్ లో ఏమ‌ని ఫీడ్ చేసుకున్నారు అని నిహారికను అడిగాడు. దీనికి స్పందించిన నిహారిక...వైష్ణ‌వ్ తేజ్ పేరును హీరోబాబు అని సేవ్ చేసుకున్న‌ట్టు చెప్పింది. అంతేకాకుండా ఉప్పెన సినిమా విడుదల కాకముందే తాను వైష్ణవ్‌ పేరును ఇలా సేవ్‌ చేసుకున్నట్లు పేర్కొంది. ఇక డెబ్యూ మూవీతోనే వైష్ణవ్‌ తేజ్‌ సూపర్‌ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే నటుడిగా ఆకట్టుకున్న వైష్ణవ్‌కు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు