కొవిడ్‌కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను: హీరోయిన్‌

13 Jun, 2022 20:35 IST|Sakshi

Nikamma Debutante Shirley Setia Meet Her Mother After 2 Years: యంగ్‌ హీరో నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రిందా విహారి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ప్రముఖ న్యూజిలాండ్‌ సింగర్‌ షిర్లీ సేథియా. తాజాగా 'నికమ్మ' అనే మూవీతో బాలీవుడ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీలో శిల్పా శెట్టి కుంద్రా, అభిమన్యు దాసాని కూడా నటించారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే షిర్లీ వాళ్ల అమ్మను కలిసి సుమారు రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల తర్వాత తాజాగా తన తల్లిని కలుసుకుంది షిర్లీ సేథియా.  

న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌ నుంచి ఇండియాకు వచ్చిన తన తల్లిని రిసీవ్‌ చేసుకునేందుకు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది షిర్లీ. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో పుట్టిపెరిగిన షిర్లీ, సినీ పరిశ్రమలో ప్రవేశించాలన్న తన తల్లి కోరికను నెరవేర్చినందుకు ఆమె ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే తన కూతురును వెండితెరపై చూసేందుకు షిర్లీ తండ్రి ఈ వారం చివర్లో వస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి షిర్లీ మాట్లాడుతూ 'నా సినిమా విడుదల కానున్న సందర్భంగా నా తల్లిదండ్రులు నావైపు నిలబడేందుకు ఇండియాకు వస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నేను వారిని కొవిడ్‌కు ముందు 2020లో చివరిసారిగా కలిశాను. చాలాకాలం గడిచింది. ఈ జూన్‌ 17 నాకు చాలా పెద్ద రోజు.' అని తెలిపింది షిర్లీ సేథియా. 

చదవండి: డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌ సోదరుడు.. పార్టీ లోపలి వీడియో వైరల్‌..

A post shared by Viral Bhayani (@viralbhayani)

మరిన్ని వార్తలు