రైడర్‌

12 Sep, 2020 06:43 IST|Sakshi

మాజీ ప్రధాని హెచ్‌.డి. దేవెగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న నాలుగో చిత్రానికి ‘రైడర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. తెలుగు, కన్నడ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్నారు. లహరి ఫిలిమ్స్‌ బ్యానర్‌పై చంద్రు మనోహరన్‌ నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్, మోషన్‌ పోస్టర్‌ను శుక్రవారం విడుదల చేశారు. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో నిఖిల్‌ కుమార్‌ ఒక ఫెరోషియస్‌ యాక్షన్‌ హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఫస్ట్‌ లుక్, మోషన్‌ పోస్టర్‌ చూస్తే తెలుస్తోంది. కశ్మీరా పరదేశీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ జన్యా, కెమెరా: శ్రీష ఎం. కుడువల్లి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా