నిఖిల్‌ ‘పేజీలు’ ప్రారంభం

21 Oct, 2020 08:50 IST|Sakshi

‘అర్జున్‌ సురవరం’ హిట్‌తో మంచి స్పీడు మీదున్న హీరో నిఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘18 పేజీస్‌’. నిఖిల్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ కథానాయికగా నటిస్తున్నారు. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ çసమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌  మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమయ్యింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సూర్యప్రతాప్‌ మాట్లాడుతూ– ‘‘నిఖిల్, అనుపమ మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ప్రస్తుతం ఈ చిత్రం షెడ్యూల్‌ను హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుపుతున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: వసంత్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా