Spy Movie: నిఖిల్‌ మూవీ 'స్పై' గ్లింప్స్‌ చూశారా?

6 Jun, 2022 12:09 IST|Sakshi

‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్‌’ వంటి సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన గ్యారీ బీహెచ్‌ దర్శకత్వం వహిస్తున‍్న చిత్రం స్పై. ఈ స్పై థ్రిల్లర్‌ మూవీలో నిఖిల్‌ హీరోగా నటిస్తున్నాడు. ఐశ్వర్యా మీనన్‌ కథానాయిక. సోమవారం ఉదయం ఈ సినిమా నుంచి ఫస్ట్‌ గ్లింప్స్‌ రిలీజయ్యాయి. ఇందులో మంచు కొండల్లో హీరో నిఖిల్‌ ఒంటరిగా నడుస్తూ కనిపించాడు.

ఆ తర్వాత మంచుతో కప్పేసిన ఓ బాక్స్‌ను తెరిచి అందులో ఉన్న తుపాకీలను బుల్లెట్లుతో సహా నింపుకుని సమరానికి రెడీ అయ్యాడు. మరి ఈ బుల్లెట్ల వర్షం ఎవరి మీదైనా కురిపించడానికా? తనను తాను కాపాడుకోవడానికా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే! శ్రీచరణ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.రాజశేఖర్‌రెడ్డి నిర్మిస్తున్నాడు. హాలీవుడ్‌ టెక్నీషియన్‌ జులియన్‌ అమరు ఎస్త్రాడా సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తున్నాడు. ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్‌, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారు మేకర్స్‌.

చదవండి: మూడు రోజుల్లోనే రూ.150 కోట్లు సాధించిన విక్రమ్‌
కరణ్‌ జోహార్‌ బర్త్‌ డే: బాలీవుడ్‌ సెలబ్రిటీలకు కరోనా

మరిన్ని వార్తలు