డిసెంబరులో సెట్స్‌పైకి...

5 Oct, 2020 06:11 IST|Sakshi

హీరో నిఖిల్, దర్శకుడు చందు మెుండేటి కాంబినేషన్‌ వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వీరిద్దరి కలయికలో ‘కార్తికేయ 2’ తెరకెక్కనుంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం మార్చిలో తిరుపతిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా లాక్‌డౌన్‌ వల్ల చిత్రీకరణకు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా డిసెంబరులో తిరిగి సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు