సిగరెట్‌ కాలుస్తూ హీరో నిఖిల్‌..

29 May, 2021 11:09 IST|Sakshi

‘అర్జున్‌ సురవరం’ హిట్‌తో జోరు మీదున్న నిఖిల్‌ చేస్తున్న తర్వాతి చిత్రం 18 పేజెస్‌. ఈ చిత్రంలో  అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. టాలెంటెడ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కథ–స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పణలో ‘బన్నీ’వాసు నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను కుమారి 21 ఎఫ్‌’ ఫేమ్‌ సూర్యప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. జూన్‌1న నిఖిల్‌ బర్త్‌డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీ లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ​ చేశారు. ఇందులో నిఖిల్‌ సిగరెట్‌ తాగుతూ చేతిలో పేపర్‌ను అంటిస్తున్నట్లుగా ఉంది. దీనిపై ఫస్ట్‌ లుక్‌ జూన్‌1న అని రాసి ఉంది. ఇప్పటికే సినిమాలో టైటిల్‌ క్యూరియాసిటీని పెంచుతుంది. గోపీసుందర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 

చదవండి : నిఖిల్‌కు పోలీసులు షాక్‌.. అలా చెప్పిన వదల్లేదంటూ ట్వీట్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు